Suryaa.co.in

Features

గో సంరక్షణ

గోవు పరదేవతా స్వరూపం. గోవు సకల దేవతా స్వరూపం. పీఠాలలో చేసే గజ పూజ, అశ్వ పూజ పశుపూజ. కాని గోవుకు చేసే పూజ సాక్షాత్ కామాక్షికి చేసిన పూజతో సమానము. గోవు అంటే దేశవాళి గోవు. వేరేవి గోవులు కాదు.
మనకు గోపూజ చేసే సంప్రదాయం ఉన్నప్పటికి, చాలా మంది గోవులను సరిగ్గా రక్షించరు. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో గోవుల సంఖ్య ఎక్కువ. కాని పాల ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. వేరే దేశాలతో పోల్చితే మన దేశంలో పాలను చాలా తక్కువ తీసుకుంటాము. ఇప్పుడు గోవధశాలలో చంపబడుతున్న గోవులన్నీ వారు మన హిందువుల నుండి తీసుకున్నవే.
దీనికి ముఖ్య కారణం పశువుల మేతపై మనకు ముందుచూపు లేకపోవడమే. మనదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన గోవుల విషయంలో మన శాస్త్రం మనకు ఇచ్చిన బాధ్యతలను కూడా మర్చిపోయాము. ఇళ్ళల్లో గోవులను పెట్టుకుని పోషిస్తున్న వారు కూడా వాటీ విషయంలో చేయరాని పాపం చేస్తున్నారు. వాటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. కేవలం వాటి పాలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారు.
కానీ గో సంరక్షణ మనందరి బాధ్యత. ఏమాత్రం ఖర్చులేకుండా గోవులకు మేత సమకూర్చడం చాలా తేలిక. గృహిణులు, హోటల్ యాజమాన్యం, హాస్టల్ వంటవారు రోజూ వారి వంటల్లో వాడే ఆకుకూరల వ్యర్థాలు, పళ్ళు కూరగాయల తొక్కు, బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం వంచిన గంజి మొదలగునవి శుభ్రంగా భద్రపరిచి వాటిని గోవులకు పెడితే సరి. వాటికి కావలసిన పోషణ మేత రెండూ లభిస్తాయి.
కానీ ఈరోజు మనం వీటన్నింటిని అనాలోచితంగా వీధులలో, చెత్త బుట్టలలో పారబోసి మన పారిశుధ్య కార్మికులకు పని పెడుతున్నాము. ప్రతివారు వీటిని దగ్గర్లో ఉన్న గోశాలకు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి కేవలం కొద్ది శ్రమ, చేయవలెనన్న అలోచన ఉండాలి అంతే.
గోశాల నిర్వాహకులు మరియు గోవుల యజమానులు కొంతమంది కలిసి ప్రతి ఇంటికి వెళ్ళీ వీటీని సేకరించవచ్చు. అలా సేకరించినది చాలా గోవులకు సరిపోగలదు. వాటికి మంచి పోషణ కూడా లభించగలదు. ఈ చిన్న ఆలోచన చేత గోవులకు మంచి మేత లభించడమే కాక మన దేశ పశుసంపద కూడా వృద్ధి పొందుతుంది. మనం గోవులను సంరక్షించము అనే అపవాదు తొలగటంతో పాటు ఈ గోసేవ వల్ల శాస్త్రంలో చెప్పినట్టు పుణ్యం కూడా చేకూరుతుంది.
1958 జులై 1న వ్యాస పూజ సందర్భంగా స్వామి వారి ఉపన్యాసం.
— “అచార్యాస్ కాల్” ప్రమాచార్య స్వామి వారి ప్రసంగాల సంకలనం
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE