మీరు ఎంత క్రిస్పీగా ఉల్లిని / మిర్చీ బజ్జీని వేయించినా.. పొట్లం కట్టేప్పుడు న్యూస్ పేపరుతో కట్టేప్పుడు చౌక పేపర్ కాకుండా క్వాలిటీ పేపర్ దొరికితే బాగుండు అని అనుకుంటారు.
సాక్షి నుండి చాలా న్యూస్ పేపర్లు కిలోల లెక్కన కొని, చింపుతూ.. పొట్లం కట్టేప్పుడు, నూనె అంటుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు.
మీకో గుడ్ న్యూస్!
వైద్య విద్యలో కీలక మలుపు: PPPని ప్రోత్సహించిన పార్లమెంటరీ కమిటీ!
భారత వైద్య విద్యలో సీట్ల కొరతను తీర్చడానికి, ఖర్చులను నియంత్రించడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఛైర్మన్: భువనేశ్వర్ కలిత) సంచలన సిఫార్సులు చేసింది. ప్రైవేట్ పెట్టుబడులు, PPP (Public-Private Partnership) విధానాన్ని స్వాగతించాలనేది ప్రధానాంశం.
అయితే, ఇది కేవలం ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఇవ్వడం కాదు, కఠినమైన ‘నాణ్యత-అందుబాటు’ షరతులతో కూడిన ప్యాకేజీ:
అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కనీసం 50% సీట్ల ఫీజును రాష్ట్ర ప్రభుత్వ ఫీజుతో సమానంగా నియంత్రించాలి. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తప్పనిసరి.
ప్రైవేట్ కళాశాలలు జిల్లా ఆసుపత్రులతో తప్పనిసరిగా అనుసంధానం కావాలి. దీనివల్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది, విద్యార్థులకు మెరుగైన శిక్షణ దొరుకుతుంది.
AIIMS వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ‘మెంటార్ ఇన్స్టిట్యూట్లుగా నియమించి, అన్ని రకాల (ప్రభుత్వ, ప్రైవేట్, PPP) కళాశాలల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలి.
ప్రస్తుత మౌలిక వసతులను వాడుకుంటూ, ఒక్కో కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను 250 వరకు పెంచేందుకు అనుమతించాలి.
కమిటీలో YSRCP ప్రాతినిధ్యం: ఈ నివేదికను రూపొందించిన కమిటీలో YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరపున తిరుపతి లోక్సభ ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి సభ్యులుగా ఉన్నారు.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PPP పద్ధతిలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు చురుకుగా ప్రణాళికలు వేస్తోంది. కేంద్రం యొక్క ఈ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క PPP లక్ష్యాలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.
వైద్య విద్యలో పెట్టుబడిని ఆహ్వానిస్తూనే, సామాన్యులకు అందుబాటు, నాణ్యత హామీనిచ్చేలా ఈ నివేదిక సమతుల్య విధానాన్ని సూచించింది.
***
పీపీపీ విధానాన్ని వక్రీకరిస్తూ పూర్తి ప్రైవేటు అని తప్పుదోవ పట్టిస్తూ.. కోటి సంతకాలు అని డ్రామా ఆడుతున్న వైకాపా, కనీసం ఒక్కో జిల్లాకు ఒక పదివేల సంతకాలను, ఏ4 సైజు పేపర్ల మీద సేకరించి వుంటే.. స్థానికి వైకాపా ఆఫీసులో వాటిని అడగండి.
మీ పకోడీ, మిర్చీ బజ్జీ కస్టమర్లకు క్వాలిటీ పేపర్లలో చుట్టి అందించండి. దయచేసి సున్నితంగా అర్థం అయ్యేట్లు చెప్పండి. సమాజానికి మేలు చేసే ఉద్దేశం ఉంటే నిప్పెట్టకుండా ఇవ్వమని ఒప్పించండి.
– చాకిరేవు