సికింద్రాబాద్, డిసెంబరు 21: క్రైస్తవులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రైస్తవ మతస్తులకు మంచి ప్రాధాన్యత ఇచ్చి వారి బాగోగుల పట్ల శ్రద్ధ చూపుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. బౌద్దనగర్ డివిజన్ పరిధిలోని బెధానీ చర్చ్ లో సికింద్రాబాద్ పరిధిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ ను కట్ చేశారు. ప్రభుత్వం
అందించిన క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో కనీసం 10 వేల మంది క్రైస్తవులకు ప్రభుత్వ కానుకలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గ క్రైస్తవులకు, ప్రజలకు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ కంది శైలజ, తెరాస నేతలు కంది నారాయణ తదితరులతో పాటు చర్చ్ నిర్వాహకులు, నేతలు పాల్గొన్నారు.