Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోంది

-నిరసన తెలిపితే చంపేస్తారా? ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా?
-బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు అధికారపార్టీ పెద్దలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
– తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

కొంతమంది పోలీసులు అధికారపార్టీ పెద్దలకు తొత్తులుగా మారిపోయారు. వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేయడమే తమ విధిగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైకాపా నాయకులు పిలుపునిస్తే ఎమ్మెల్యేకు రక్షణ కల్పించాల్సిందిపోయి ముట్టడికి సహకరిస్తారా? ఇదేనా శాంతిభద్రతలు కాపాడటం అంటే?

రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోంది. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలనే టార్గెట్ గా అధికారపార్టీ నేతల చేష్టలు ఉన్నాయి. నాలుగేళ్లైన జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వంపై నిరసన తెలిపితే వారి కుటుంబ సభ్యులపై కక్ష తీర్చుకుంటున్నారు. సుధాకర్ అనే టిడిపి నేత నిరసన ర్యాలీలో పాల్గొన్నారని ఆయన భార్య హనుమాయమ్మను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపడం చేస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.

నిరసన తెలిపితే చంపేస్తారా? ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? అధికారపార్టీ పెద్దలకు వత్తాసు పలుకుతూ అమాయకులకు అన్యాయం చేయడమే పోలీసుల పనా? ఇప్పటికైనా జిల్లా ఎస్పీ ఈ దారుణంపై వెంటనే స్పదించి దోషులను అరెస్టు చేయాలి. సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలి. అధికార పార్టీ గూండాల నుంచి ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించాలి.

LEAVE A RESPONSE