– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైసీపీ సర్కారు సైకోయిజానికి పరాకాష్ట టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి అరెస్టు. శాంతస్వభావి, దళిత మేధావి అయిన డాక్టర్ స్వామి జగన్ సర్కారు అవినీతిని ప్రశ్నిస్తున్నారనే పదేపదే టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. అధికారంలో ఉండి, విపక్ష దళిత ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడం అంటే ముమ్మాటికీ కక్షసాధింపే. డాక్టర్ స్వామి గారిపై దాడిచేసి అత్యంత అమానవీయంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.