– టీడీపీ శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్
ఎస్సీ,ఎస్టీ,బీసీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ చులకన భావంతో చూస్తున్నారు. మొన్న దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ చేత చొక్కా విడిపించిన జగన్ రెడ్డి నేడు దళిత ఎమ్మెల్యే స్వామి చొక్కా చిప్పించారు. జగన్ తన స్వార్దం కోసం దళిత ప్రజాప్రతినిధుల గౌరవాన్ని మంటగలుపుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్ లో స్వామిపై ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగడుతున్నారనే జగన్ రెడ్డి స్వామిపై కక్ష కట్టారు. జగన్ రెడ్డి కుట్రలను ఎస్సీ, ఎస్టీ,బీసీలంతా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. దళిత ఎమ్మెల్యే చొక్కా చింపిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు.