భారత రాష్ట్రపతి గౌరవ ద్రోపతి ముర్ముతో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ మంగళవారం భేటీ అయ్యారు. సోమవారం భారత 15వ రాష్ట్రపతిగా ద్రోపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ లో ద్రోపతి ముర్మును మర్యాద పూర్వకంగా కలిసిన గవర్నర్ విభిన్న సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతి ఇరువురు ఒడిశాకు చెందిన వారు కావటం విశేషం.