గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తమిళి సై గవర్నర్ పదవికి తగ్గ విధంగా హూందాగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారని, బిజెపి కార్యకర్తలా వ్యవహరించడం తగదని అన్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి లో మంత్రి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో స్పందించారు.
రాష్ట్రంలో గవర్నర్ తమిళసై హూందా తనాన్ని కోల్పోతున్నారు. గౌరవనీయమైన గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారు. గవర్నర్ గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయి. తమిళి సై రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తూ, బిజెపి నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదు. గవర్నర్ తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నాం. కానీ ఆమె బిజెపి డైరెక్షన్ లో పని చేస్తున్నారు. సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరుస్తూ తిరగడం దేనికి?
మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులుగా కనీసం మాకు ఇవ్వలేదు. రాష్ట్రంలో పర్యటిస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలను వెంటేసుకు తిరగడం దేనికి సంకేతం? ప్రభుత్వ వైద్యశాలలపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలంగాణలో ఇస్తున్నంత మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదు. గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇచ్చేది లేదు పుచ్చేది లేదు ప్రధాని సమావేశాలకు గవర్నర్ ఎందుకు వెళ్లాలి? దయచేసి మీరు హూందాగా ప్రవర్తించాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేస్తన్నా. గవర్నర్ పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తించాలని నేను చేతులెత్తి మొక్కుతున్నా!