Suryaa.co.in

Telangana

గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య స‌మాఖ్య స్పూర్తికి గొడ్డ‌లిపెట్టు

గ‌వ‌ర్న‌ర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు
ఉద్దేశ‌పూర్వ‌కంగా రాష్ట ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు
గ‌తంలో ఏ గ‌వ‌ర్న‌ర్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌లేదు
రాజ‌కీయ క‌క్ష్య‌సాధింపుల‌కు పాల్ప‌డటం స‌రికాదు
మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌందరరాజన్ చ‌ర్య స‌మాఖ్య స్పూర్తికి గొడ్డ‌లిపెట్టు వంటిద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర కాబినెట్ చేసిన సిఫార‌సును గవర్నర్ తిరస్కరించ‌డాన్ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు.

ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫార‌సును గవర్నర్‌ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాజ‌కీయ క‌క్ష్య‌సాధింపుల‌కు పాల్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని సూచించారు. గ‌తంలో ఏ గ‌వ‌ర్నర్ ఇలా వ్య‌వ‌హ‌రించిన దాఖ‌లాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్టీ, బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారి ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు.

రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌ వారిని సేవా కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని గవర్నర్‌ ప్రశ్నిస్తున్నారని? అంటే గవర్నర్‌కు రాజకీయ నేపథ్యం ఉండొచ్చు కానీ గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసే వ్యక్తికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉండొద్దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

LEAVE A RESPONSE