Suryaa.co.in

Telangana

గవర్నర్ ప్రసంగమా? కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా?

-రాష్ట్రాన్ని బాగు చేయకున్నా నష్టం చేయకుంటే చాలు
-గవర్నర్ ప్రసంగం పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆర్థిక విద్వంసం కాదు .. ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చాం.అప్పుల పేరుతో పథకాల నుండి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం.గవర్నర్ ప్రసంగమా ? ఎన్నికల ముందు కాంగ్రెస్ మాట్లాడిన ప్రచార మాటలా ? కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా?మొత్తం గవర్నర్ ప్రసంగం లో తెలంగాణ ఈ పది సంవత్సరాల లో తిరోగమనం లో ఉంది అన్నట్లు చెప్పారు.అదే నిజమైతే మరి కేంద్ర ప్రభుత్వ నివేదికలు, RBI, NITI Aayog report, UNO మరియు ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు ఇచ్చిన ఆవార్డులు, గుర్తింపులు దాచేస్తే దాగని సత్యాలుగా ?

తెలంగాణలో పండుతున్న పంటలు సత్యం, వస్తున్న కరంటు సత్యం, పారుతున్న నీళ్లు సత్యం, పెరిగిన తలసరి ఆదాయం సత్యం, జరిగిన హైదరాబాద్ అభివృద్ధి సత్యం, గ్రామాలలో స్వచ్ఛత సత్యం, పట్టణాల సుందరీకరణ సత్యం, SOTR లో తెలంగాణ దేశానికి తలమానికంగా ఉన్నది అన్నది సత్యం, IT, industry అభివృద్ధి సత్యం.అబద్ధాలు చెప్పడం వలన అభాసు పాలు కావడం తప్ప ఏమీ ఉండదు.తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద బురద చల్లే కంటే 6 గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ వహిస్తే మంచిది

విద్యుత్ శాఖలో రూ.86 వేల కోట్ల అప్పులను చూపడం హస్యాస్పదం.పదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.42 వేల కోట్లు, రూ.26 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్, 6 నుండి 25 కు పెరిగిన 400 కేవీ సబ్ స్టేషన్లు, 51 నుండి 103కు పెరిగిన 220 కేవీ సబ్ స్టేషన్లు, 176 నుండి 250కి పెరిగిన 132 కేవీ సబ్ స్టేషన్లు, 2138 నుండి 3250కి పెరిగిన 33/11 కేవీ సబ్ స్టేషన్లు దాచేస్తే దాగని సత్యాలు. తెలంగాణ ఏర్పడే నాటికి 7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ స్థాపిత సామర్ద్యం 2023 మే నాటికి 18,567 మెగావాట్లకు పెంచుకున్న విషయం నిజం కాదా ?

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి అత్యంత తక్కువగా రుణాలు తీసుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా ? కాదా ? కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు మాని ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందో చెప్పాలి. రాష్ట్రాన్ని బాగు చేయకున్నా నష్టం చేయకుంటే చాలు.

LEAVE A RESPONSE