Suryaa.co.in

Telangana

మా పార్టీ అధినేత కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉంది

– ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు

చిట్ చాట్ పేరిట నేను అనని మాటలను అన్నట్టు ప్రసార సాధనాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించే మాట్లాడుతా కానీ చిట్ చాట్ లో మాట్లాడను.నాకు మా పార్టీ అధినేత కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉంది ..ఆయన అప్పజెప్పిన ఎన్నో భాద్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చా. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.ఓటమి కి కారణాలు ఏవైనా ఉంటే నేను పార్టీ వేదికల్లో చెబుతాను తప్ప చిట్ చాట్ తదితర రూపాల్లో కాదని స్పష్టం చేస్తున్నా .నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పే విషయాలనే నా వ్యాఖ్యలుగా పరిగణించాలి తప్ప నా చిట్ చాట్ పేరిట జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మ వద్దని విజ్ఞప్తి.

LEAVE A RESPONSE