Suryaa.co.in

Telangana

గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం

-దళిత బంధు ప్రస్తావన లేదు
-రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడ లేదు
-కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదు
-మాజీ మంత్రి కడియం శ్రీహరి

గవర్నర్ ప్రసంగం లో కొత్త దనం లేదు. అభివృద్ధి కి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉన్నది.పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ని విస్మరించారు. తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. నీతి ఆయోగ్ ప్రశంసలు ,కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారు. ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ నెంబర్ వన్ ,ఐటీ ఎగుమతుల్లో సాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారు.

తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదు ..ఆమె స్థాయి కి తగదు.గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు.2014 లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తం అయ్యింది ఇపుడు కావడమేమిటో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదు. దళిత బంధు ప్రస్తావన లేదు. రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడ లేదు. కాంగ్రెస్ హామీల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉంది.

LEAVE A RESPONSE