– “చీప్ ట్రిక్స్” తో తిరుపతి పరపతి మంటగలిసింది
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పూల అలంకరణలో “J” అక్షరంతో “గన్” బొమ్మతో “జెండా” గుర్తులతో అలంకరించడం మహా అపచారం !
గంగమ్మ జాతర 7 రోజుల పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో గంగమ్మ తల్లి అనుగ్రహంతో అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మధ్య వేలాదిమంది భక్తులు ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని విజయవంతం చేశారు!
గంగమ్మ జాతర ముందు రోజు అత్యుత్సాహంతో ఆలయంలో ఏర్పాటు చేసిన పూల అలంకరణలో J “గన్” బొమ్మలు చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు గంగమ్మ జాతర గురించి తెలిసినవారు ఎంతో ఆవేదన చెందారు!
హిందూ దేవాలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆలయ పవిత్రతను భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అరాచకాలు చేస్తున్నా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం మహా పాపం!
తిరుమల కొండ మీద “స్టిక్కర్లు” అతికించినప్పుడే టిటిడి అధికారులు సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు గంగమ్మ ఆలయంలో పూల అలంకరణలో “J” అక్షరంతో తుపాకీ,జెండా బొమ్మలతో ఏర్పాటు చేసేందుకు గుండెల్లో వణుకు పుట్టి భయపడేవారు! ముఖ్యమంత్రి మెప్పుకోసం ఇలాంటి “చీప్ ట్రిక్స్” చేసి భక్తుల మనోభావాలను కించపరచకండి, ఆలయాల పవిత్రతను దెబ్బతీయకండి!
“రాష్ట్ర పండుగ” గా గంగమ్మ జాతరను గుర్తిస్తూ జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతగా తిరుపతి ప్రజలంతా పార్టీలకు అతీతంగా అధికార పార్టీ నాయకులతో సహా THANK YOU CM అని ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పెట్టాల్సింది పోయి , చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇలా “చీప్ ట్రిక్స్” చేయడంతో తిరుపతి పరపతి మంటగలిసింది!
ముఖ్యమంత్రి కి ప్రభుత్వానికి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చే విధంగా గంగమ్మ ఆలయంలో J “గన్” పూల అలంకరణతో అపకీర్తి తీసుకువచ్చిన వారిని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు వెంటనే గుర్తించి, సీఎం కార్యాలయానికి నివేదికను పంపి ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా!
తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అధికారులు J “గన్” పూల అలంకరణ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా, ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండడంలోని ఆంతర్యం ఏమిటి!
తిరుపతి పోలీస్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ ప్రాంగణంలో పూల అలంకరణ చేసిన కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని విచారించి ఏ అధికారి ఆదేశాలతో ఇలా చేశాడు అన్న వాస్తవాన్ని భక్తులకు తెలియజేయాల్నిన బాధ్యతుందన్నారు! గంగమ్మతల్లీ పాహిమాం పాహిమాం
