చంద్రన్నది సంపద సృష్టి విజన్.. జగన్ రెడ్డిది దోచుకునే విజన్

-చంద్రన్న పైసా ఖర్చు లేకుండా రూ.2లక్షల కోట్ల ఆస్తిచ్చాడు.. జగన్ రెడ్డి రూ.2లక్షల కోట్ల ప్రజల సంపద దోచుకున్నాడు
-బీసీల గురించి మాట్లాడే అర్హత లేని ఏకైక నాయకుడు జగన్ రెడ్డి.. ఏకైక పార్టీ వైసీపీ
-బడుగులపై దాడులు చేసి.. జీవితాలు ఛిద్రం చేసిన ఘనత జగన్ రెడ్డిదే
-పద్మశాలీ, దేవాంగ, తూర్పుకాపు/గాజులకాపు సాధికార సమితి కన్వీనర్ల శిక్షణా కార్యక్రమంలో కొల్లు రవీంద్ర

రాజకీయ ఫలాలను రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీకీ అందించడమే లక్ష్యంగా నేడు సాధికార సమితుల్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ, తానో చక్రవర్తిగా, నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలోని బీసీలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. హత్యలు చేశారు.

అత్యాచారాలు చేస్తున్నారు. ఇంత చేసి కూడా బీసీలను ఉద్దరించేస్తున్నా అంటూ జగన్ రెడ్డి ప్రచారం చేసుకోవడాన్ని మించిన అరాచకం ఇంకోటి ఉంటుందా అని బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి అధ్యక్షతన పద్మశాలి, దేవాంగ, తూర్పుకాపు/గాజుల కాపు సాధికార సమితుల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబుది సంపద సృష్టించే విజన్ అయితే.. జగన్ రెడ్డిది సంపద దోచుకునే విజన్. చంద్రబాబు రూపాయి ఖర్చు లేకుండా అమరావతిలో రూ.2 లక్షల కోట్ల ఆస్తి సృష్టించి ప్రజలకు ఇస్తే, జగన్ రెడ్డి రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.2లక్షల కోట్ల ఆస్తులు దోచుకున్నాడు. విజనరీకి, ప్రిజనరీకి ఉన్న తేడా అదే. చంద్రబాబు ప్రజల ఆదాయం పెంచాలి, ఆస్తులు పెంచాలి. రాష్ట్రంలో సంపద పెంచి ప్రజలకు పంచాలి అని ప్రయత్నిస్తుంటే.. జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తాన్ని తన ఖజానాకే చేరాలి అనేలా వ్యవహరిస్తున్నాడు.

కవితకేదీ కాదు అనర్హం అని అప్పుడెప్పుడో శ్రీశ్రీ చెప్పినట్లు.. దోపిడీకి ఏదీ కాదు అనర్హం అని జగన్ రెడ్డి నిరూపిస్తున్నాడు. ఇసుక నుండి తైలం పిండారు అనే సామెత మాదిరిగా, ప్రతి రంగంలోనూ జగన్ రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నాడు. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి తన ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నాడు.

సంక్షేమం పేరుతో ప్రజల్ని మభ్యబెట్టి, రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నాడు. సంక్షేమం అంటే.. ప్రజల్ని సొంత కాళ్లపై నిలబెట్టేదిగా ఉండాలని చంద్రబాబు నాయుడు భావించి, జనాభాలో సగం ఉన్నప్పటికీ, ఆర్ధికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న బీసీలకు ఆర్ధిక పరిపుష్టి కల్పించేందుకు తాపత్రయపడ్డారు.

ప్రతి కుటుంబం కూడా కనీసం రూ.10వేలు ఆధాయం పొందాలని ప్రయత్నించారు. చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఆదరణ కింద పరికరాలిచ్చి ఉత్పాదకత పెంచి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ల ద్వారా రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు. ప్రమాదాల్లో మరణించినా వారి కుటుంబాలు రోడ్డున పడకూడదనే లక్ష్యంతో చంద్రన్న బీమాకు ర పకల్పన చేశారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక చిల్లర విదిల్చితే చాలు అనే పరిస్థితికి వచ్చారు.

చదువుతోనే సమాజం మారుతుందని ప్రపంచమంతా ఘోషిస్తుంటే.. జగన్ రెడ్డి ఆ చదువుల్ని దూరం చేస్తున్నాడు. స్కిల్ డెవలప్ చేసుకోనీయకుండా అడ్డుకున్నాడు. కమ్యూనిటీ భవనాలు రద్దు చేసి కులాల్ని అణగదొక్కాడు. అడాల్ఫ్ హిట్లర్ కంటే ఘోరంగా బీసీలను అణగదొక్కుతున్నాడు.. గోబెల్స్ మించిన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. గడాఫీని మించిన నియంతలా వ్యవహరిస్తూ.. బీసీలను చంపుతున్నాడు.

ఇలాంటి సమయంలో బీసీలంతా ఏకమైతే.. జగన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా మనల్ని ఓడించలేడు. మనం అధికారంలోకి వస్తేనే ఏం చేయాలన్నా చేసుకోగలం. అభివృద్ధి సాధించుకుంటాం. అందుకే బీసీ కులాలన్నింటినీ కలుపుతూ సాధికార సమితులు ఏర్పాటు చేసుకున్నాం. ఆ సాధికార సమితులన్నీ ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుని, ఏం చేస్తే అభివృద్ధి చెందుతామో గుర్తించాలి.

అందుకు ఒక్కో కులం ఒక్కో నివేదిక తీసుకు రావాలి. వాటిని పోరాడి మరీ సాధించుకుందాం. ఆ పోరాటానికి ముందుంటా. వెనుకబడిన కులాలుగా భావించబడుతున్న బీసీల్లోని అన్ని కులాల వారు కూడా.. ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా మెరుగైన జీవితాలు సాధించుకుందామన్నారు.

శాసన మండలి సభ్యులు, పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. మాఫియాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి వైసీపీ నేతలు సహా జగన్ రెడ్డి నీతి వాక్యాలు వల్లిస్తుంటే.. హాస్యాస్పదంగా ఉంది. చేనేతలకు జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడు. మంగళగిరిలో చేనేత భవన్ కూల్చేసిన జగన్ రెడ్డి చేనేతల గురించి మాట్లాడే అర్హత ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కుదించిన జగన్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే హక్కుందా?

బీసీ కార్పొరేషన్లకు నిధుల్లేవు, సబ్ ప్లాన్ నిధులు దోచేస్తున్నారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా నన్ను అవమానించి, వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు గానీ, రాష్ట్రానికి గానీ చేసిందేమీ లేదు. కానీ ల్యాండ్, శాండ్, వైన్, మైన్, మాఫియాలు, గంజాయి, డ్రగ్స్ ద్వారా రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచేస్తూ ఇంకా రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు.

పేద ప్రజలు కడుపు నిండా భోజనం తినడం కూడా జగన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే అన్న క్యాంటీన్లు కూల్చేశాడు. ప్రతిపక్షాలు క్యాంటీన్లు పెడితే కూలగొడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలు జీవించగలుగుతారని అన్నారు.

టీడీపీ మానవ వనరుల విభాగం ఛైర్మన్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందనే విషయాన్ని గుర్తించాలి. జగన్ రెడ్డిని సమర్ధించే వారిని నిలదీయాలి. ప్రతి కులం నుండి నాయకత్వం వస్తేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. సాధికార సమితుల ఏర్పాటు లక్ష్యం అదే. అందుకే పీ-4 ఫార్ములా రూపొందించారు. ప్రజలందరినీ సంపన్నుల్ని చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు.

సంపద సృష్టించడం తెలిసిన వాడికి మాత్రమే దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలుస్తుంది. జగన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా అంటూ అప్పులు చేయడం తప్ప చేసిందేంటి? ఏ ఒక్కరైనా సుస్థిరాభివృద్ధి సాదించారా? అబద్దాలు మోసాలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిని అవే అబద్దాలు ముంచేయబోతున్నాయి. మన జాతిని నిలబెట్టేందుకు జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని తొక్కిపడేయాల్సిందే.

ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతలపట్ల జగన్ రెడ్డి వైఖరి చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పథకాలు, సబ్సిడీలు మొత్తం ఎత్తేసి ఉద్దరిస్తున్నా అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. జగన్ రెడ్డి చేసిన దురాగతాలు, చంద్రబాబు చేసిన మేలును ప్రజలకు వివరించాలి. బటన్ నొక్కే జగన్ రెడ్డికి ప్రజలు బ్రతుకు పోరాటం ఏం తెలుస్తుంది? ప్రజాక్షేత్రంలో ఉణ్న ప్రతిఒక్కరూ పటిష్టమైన విజన్‌తో ముందుకు వెళ్దాం. అభివృద్ధి చెందుదాం అన్నారు.

టీడీపీ మానవ వనరుల విభాగం సభ్యుడు ఎస్.పి.సాహెబ్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవంతో బీసీలందరినీ ఏకం చేయాలని భావించి బీసీ సాధికార సమితులకు రూపకల్పన చేశారు. నాయకత్వాన్ని పెంచడం, బీసీల్లో రాజకీయ అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీలకు జరిగిన అన్యాయం కంటే.. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో జరిగిన అన్యాయమే ఎక్కువ. జనాభాలో 50శాతం ఉన్నప్పటికీ నిధులు సాధించుకోవడంలో వెనుకబడ్డాం. టీడీపీ భూములిచ్చింది. సబ్ ప్లాన్ తో నిధులిచ్చింది.

కానీ ఇప్పుడు నిధులు లేవు. భూములు లాక్కుంటున్నారు. బీసీలు ఏకమైతే జగన్ రెడ్డికి చుక్కలు కనిపిస్తాయని తెలిసే కులాల వారీగా విడగొట్టి నకిలీ కార్పొరేషన్లు పెట్టాడు. సంక్షేమ పథకాలు రద్దు చేసి, నిధులు మళ్లించడం బీసీ ద్రోహం కాదా అని ప్రశ్నించారు.

బీసీ సెల్ సాధికార సమితి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. బీసీ సెల్ తరఫున మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే సోషల్ మీడియా వినియోగంపై బీసీలు అవగాహన పొందాలి. గ్రామగ్రామాన ఉండే బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా వేధికగా ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తిద్దామని, జగన్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చాటిచెబుదామన్నారు.

కార్యక్రమంలో.. పద్మశాలి సాధికార సమితి కన్వీనర్ మడిమి దేవేంద్రనాథ్, దేవాంగ సాధికార సమితి కన్వీనర్ బీరక ప్రసాద్, తూర్పుకాపు/గాజులకాపు సాధికార సమితి కన్వీనర్ కంది మురళీ నాయుడు, సాధికార సమితుల కోఆర్డినేటర్, బీసీ కార్పొరేషన్ మాజీ బొడ్డు వేణుగోపాల్, గొల్లంగి ఆనంద బాబు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply