– నరేంద్ర రామాంజుల రెడ్డి సీఎం సమీప బంధువు
– లేపాక్షి భూములు అనంత రైతుల ప్రతిరూపం
– పిఎసి ఛైర్మన్, ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
అనంతపురం: ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. లేపాక్షి నాలెడ్జ్ హాబ్ ఆస్తులను 500 కోట్లకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అనంతపురం జిల్లా రైతుల త్యాగాల ప్రతి రూపం. పదివేల కోట్ల రూపాయల భూమిని 500 కోట్లకు అప్పన్నంగా అరవిందో, రాంకీ, ఎత్తిన్ సంస్థలకు అప్పచెప్పడానికి సిద్దమైంది. నరేంద్ర రామాంజుల రెడ్డి (ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి తనయుడు) సిఎం సమీప బంధువు. ఈ హాబ్ బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిఎసి ఛైర్మన్ గా లేఖ రాశా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులను ఎందుకు ఉపయోగించలేదు. వచ్చే క్యాబినెట్ లో దీనిపై మాట్లాడాలి. ఈ టెండర్ మీ కనుసన్నల్లో జరిగిందని భావించాల్సి వస్తోంది. కేంద్రం వద్ద ఎప్పుడైనా చర్చించారా. ప్రత్యేకంగా, పరోక్షంగా మీ సహాకారం ఉంది. టిడిపి తరపున న్యాయపోరాటానికి సిద్దపడుతాం. ఎ.జికి లెటర్ వ్రాశామని చేతులు దులుపుకోవడం సరైంది కాదు. ప్రజాపోరాటాలు, న్యాయపోరాటాలకు సిద్దం