Suryaa.co.in

Telangana

రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్ళు

• సరిహద్దులలో చెక్ పోస్టులు
• రెండు సీజన్ లలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
• సి.యం.ఆర్ లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదు
• 30 లోగా సి.యం.ఆర్ ను అప్పగించాల్సిందే
• పాత బియ్యం అప్పగిస్తేనే కొత్త ధాన్యం ఇస్తాం
• రాష్ట్రంలో ప్రతి రైస్ మిల్లును సి.యం.ఆర్ లో భాగాస్వామ్యం చేస్తాం
• 9 సంవత్సరాల్లో ఆరు రేట్లు పెరిగిన ధాన్యం కొనుగోళ్ళు

హైదరాబాద్, ఏప్రిల్ 10 :: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు టి.హరీష్ రావు, గంగుల కమలాకర్ , ఎస్. నిరంజన్ రెడ్డిలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించకొని కొనుగోళ్ళకు సిద్దం కావాలని, రాష్ట్రంలో రైతుల పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, ఇందు కోసం 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

యాసంగి ధాన్యం కొనుగోలు, సియంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లలు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీ.ఎం లు, ఎఫ్.సి.ఐ అధికారులతో సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి టి. హరీష్ రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డిలు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమీషనర్ అనీల్ కుమార్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేందర్ లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీ.ఎం లు, ఎఫ్.సి.ఐ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ‘దాన్యం కొనుగోల్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్దం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోల్లపై సమీక్ష నిర్వహింస్తాం. యాసంగికి సీజన్ CMRను ఈ నెల 30వ తేదిలోగా మిల్లర్లు నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి CMR అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగిన ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న CMR ని అప్పగించి ఈ సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు CMR లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు’ మంత్రులు ప్రకటించారు.

 

దేశంలో ఆయా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో రెండు సీజన్ లో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా రాష్ట్రం అని వారు పేర్కొన్నారు, రేపటి నుంచి అదనపు కలెక్టర్లు జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు పేర్కొన్నారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లు గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగహాన కల్పించాలని వారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో రోజురోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోలు గణియంగా పెరుగుతున్నాయని 2014-15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26 వేల 600 కోట్లకు చేరుకుంది. 9 సంవత్సరాలలో ఆరు రేట్ల ధాన్యం కొనుగోలు పెరగగా మిల్లింగ్ సామర్థ్యం రెండు రేట్ల మాత్రమే పెరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సి.యం.ఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE