Suryaa.co.in

Andhra Pradesh

గ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామ సభలు

  • సమస్యలు తీర్చడం కాదు.. మీరే పరిష్కరించుకోండి
  • ఇస్సాపాలెం గ్రామ సభలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

గ్రామాల్లో సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు.గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానిక అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు.తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు.ప్రతి వీధికీ రోడ్డు,విద్యుత్ లైట్లు,ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్డి, వంట గ్యాస్ లాంటి నిత్యావసరాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అదే సమయంలో విద్య,వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని,ఉపాధి హామీ పథకం ద్వారా స్కూల్లు,ఆస్పత్రి భవనాల నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు.ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నాడు ఉపాధి హామీ పథకం మొదలైందని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ఆర్ధిక పరిపుష్టికి ఉపయోగించుకోవాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవాలని పిలుపునిచ్చారు. చెరువుల్ని బాగు చేసుకుని వ్యవసాయానికి అవసరమైన నీటిని నిల్వ చేసుకుందాం అన్నారు.

గ్రామ అవసరాలు ఎవరో తీర్చడం కాదు.. మన గ్రామానికి ఏం కావాలో మనమే అజెండా తయారు చేసి ప్రభుత్వానికి పంపిద్దామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీవో సరోజినీ,జనసేన ఇన్చార్జ్ సయ్యద్ జిలాని,టీడీపీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్,సచివాలయ సిబ్బంది,గ్రామ టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE