ఖమ్మం సభకు బయలుదేరిన చంద్రబాబు
రసూల్‌పుర వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు
తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం
చంద్రబాబు నాయుడు కి అడుగడుగునా స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి ఖమ్మం సభకు బయలుదేరారు. చంద్రబాబు వెంట భారీ కాన్వాయ్‌తో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని
జ్ఞానేశ్వర్ కూడా ఖమ్మం బయలుదేరారు. రసూల్‌పుర వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవున తెలుగు తమ్ముళ్ళు స్వాగతం పలికారు.
తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం
ఎనిమిదిన్నరేళ్ళ తర్వాత తెలంగాణలో మెదటసారి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణలో పాలిటిక్స్ మరింత రాజుకోనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఒకవెలుగు వెలిగిన తెలుగుదేశం రాష్ట్ర విభజన అనంతర రాజకీయాలతో కోలుకోలేని దెబ్బతింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో తిరిగి బలోపేతయ్యేందుకు ఖమ్మంలో విజయశంఖారావం పేరులో బుధవారం ఖమ్మం సర్దార్ పటేల్‌స్టేడియంలో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. అధినేత చంద్రబాబు ఈ సభ ద్వారా తెలంగాణ టీడీపీకి దశ, దిశ నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చంద్రబాబు సభ విజయవంతం
కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా సన్నాహక సమావేశాలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. సభ జరిగే ఖమ్మం నగరంలో ప్రధాన వీధులతోపాటు ఇతర మండలాల్లో కూడా భారీగా హోర్డింగ్‌లు, తెలుగుదేశం జెండాలు, తోరణాలతో అలంకరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సభకు లక్షమంది వస్తారన్న అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు ఎల్బీనగర్, హయతనగర్, చౌటుప్పల్ మీదుగా మధ్యాహ్నం 2:15గంటలకు ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం నాయకనగూడెం చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఉమ్మడి ఖమ్మంజిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం కూసుమంచి మీదుగా కేశవాపురం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.