Suryaa.co.in

Andhra Pradesh

గొప్ప హృదయాలు!

ఉండవలి: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు రూ.1,10,000, పల్నాడు జిల్లా అర్చకసేవా సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచార్యులు రూ.లక్ష, వేములపల్లి శివరామకృష్ణ రూ. 50 వేలు, గుంటూరుకు చెందిన ఆర్.రవి కుమార్ రూ. 50 వేలు, కదిరికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధి కె.శ్రీనివాసులు రూ. 20 వేలు, కన్నెగంటి నవ్యత రూ. 8 వేల విరాళం అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE