-వైసీపీ నేతలపై గ్రీష్మ ఆగ్రహం
ప్రజా సమస్యపై పోరాడుతున్న ప్రతి మహిళని హింసించాలని, సాధించాలని వారికి పర్సనల్ గా హ్యుమిలియేట్ చేయడానికే వైసీపీ నాయకులంతా కంకణం కట్టుకున్నారు. వారు సోషల్ మీడియాలో పేటియం బ్యాచ్ ని, పేటీఎం కుక్కల్ని పెట్టుకున్నారు. నేడు టీడీపీలోని ప్రతి మహిళ వారి స్వార్థం కోసం పోరాడటంలేదు. మహిళలు పడుతున్న కష్టం గురించి పోరాడుతోంది. నా మహానాడు స్పీచ్ తరువాత ఎవరు ట్రోలింగ్ చేస్తున్నారో, పిక్ఛర్స్ పెడుతున్నారో నా సోషల్ మీడియాలోని పిక్చర్స్ ని కూడా తీసి
పెడుతున్నారో. మార్ఫింగ్ చేస్తున్నారో. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారో, దుర్భాషలాడుతున్నారో వారందరిని వదిలేదిలేదు. వారికి తల్లి, చెల్లి ఉన్నారా? లేదా? పిచ్చికుక్కల్లా రెచ్చిపోతున్నారు. వైసీపీ నాయకులు నాటకాలాడుతున్నారు. ఖబడ్దార్. శిరీషలకు నోటీసులిచ్చి పంపించేస్తామంటే ఊరుకుంటామా? జస్టీస్ పున్నయ్య మనవరాలిని . ప్రతిభాభారతి కుమార్తెని. దళితుల కోసం, మహిళల కోసం పోరాడే విప్లవాత్మక కుటుంబం నుంచి వచ్చాను. ఇలాంటి తాటాకు చెప్పళ్లకు బెదరను. చంద్రబాబునాయుడు పర్సనల్ సైన్యాన్ని. ప్రతి ఒక్కరి వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉన్నాయి. అన్నీ సీఐడీ కార్యాలయంలో సబ్ మిట్ చేశాను. వారి వివరాలన్నీ బయటికి వస్తాయి. ఎవరినీ వదిలేది లేదు. ఇంకో ఆడపిల్ల, తెలుగు మహిళ, రెండు రాష్ట్రాలలోని ఆడవారి గురించి అసభ్యంగా పోస్టింగులు పెట్టారంటే ఈడ్చి ఈడ్చి కొడతాను. వదిలేది లేదు. ఖబడ్దార్.