– నిన్ను అనకాపల్లి నుంచి అంతర్రాష్ట్రాలకు తరమటం ఖాయం
– టీడీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే వైసీపీ భవిష్యత్ శంకరగిరిమాణ్యాలే
– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ నోరు అదుపులో పెట్టుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కనీస గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోం. టీడీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే వైసీపీ భవిష్యత్ శంకరగిరి మాణ్యాలే. ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీ నేతల అవినీతిని ఎండగడితే దాడులు చేయటం పిరికిపంద చర్య. నలుగురు ఆకురౌడీలను, తాగుబోతులను తీసుకువచ్చి విద్వసం చేస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడుతారనుకోవటం పగటి కల. ప్రజాస్యామ్య నైతిక విలువలకు కట్టుబడిన పార్టీ టీడీపీ. ఆ విలువలు పక్కన పెట్టి పసుపు సైనికులు రోడ్లమీదకు వస్తే వైసీపీ నేతలు ఇంటి గేటు దాటి బయటకు రాలేరన్న విషయం గుర్తుంచుకోవాలి. గుడివాడ అమర్నాధ్ నువ్వు ఈ రెండున్నరేళ్లలో నీ నియోజకవర్గంలో చేసిన అవినీతి, అరాచకాలకు ప్రజలే నిన్ను అనకాపల్లి అంతరాష్ట్రాలకు తరమటం ఖాయం. నాయకుడంటే ఎలా ఉండాలో చంద్రబాబును చూసి నేర్చుకో. అవినీతి పరుడు ఫ్యాక్షన్ నాయకుడిని అభిమానించి.. విశాఖ పరిస్థితి ఏమైందో కనిపించడం లేదా.? ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తామంటే.. ఎవరూ చూస్తూ ఊరుకోరన్న విషయం గ్రహించాలి.