తమిళనాడులోని మదురై నుంచి వచ్చిస్థిరపడి గత 73 ఏళ్లగా బ్రాడీపేట మైన్ రోడ్ లో భోజన ప్రియులకు సేవలందిస్తున్న సుపరిచిత శాకాహార భోజనశాల, అరిటాకులో గుంటూరు BPT బియ్యపు వేడివేడి అన్నంతో ఆకుకూర పప్పు, కాచిననెయ్యి , రోటి పచ్చడి, గుంటూరు ఊరగాయ, ఓ వేపుడు, సాంబారు, రసం , అప్పడం, గడ్డపెరుగు ఇవే అక్కడి నిత్య మెనూ ! ఉప్పు ,పులుపు, కారం నూనె కనపడని వంటలవి .
సాంబారులో ఉల్లిపాయ అక్కడి ఓ ప్రత్యేకత ఏళ్ళ తరబడి నిత్యం భోంచేసే వాళ్ళు ఎంతో మంది , తినేవాళ్లుకు ఏమికావాలో చూసి తెలిసికొని అడిగి వడ్డించే సీనియర్ సర్వర్లు. వీళ్ళలో చాలా మంది గత 25-30 ఏళ్లగా పనిచేసే వాళ్లే. కాకపోతే పాతకాలం నాటి పర్నిచరు ,శిదిలావస్తకోస్తున్న బిల్డింగ్ . కొత్తవాళ్లకు నచ్చని వాతావరణం లా ఉన్నా , వాళ్ళు ఓమాటు భోంచేస్తే మళ్ళా అక్కడికి వెళ్ళాలసిందే . మీరు ఓమాటు ప్రయత్నించండి !!
-సేకరణ