ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదటి విడతగా హజ్ యాత్రకు వెళ్తున్న ప్రయాణికుల విమానం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరింది . విమానం బయలుదేరకముందు బెంగుళూరులోని కర్ణాటక రాష్ట్ర హజ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ హజ్ యాత్రికులను విమానశ్రేయం లోపలికి తీసుకుని వెళ్తున్న 8 ప్రత్యెక బస్సులకు పచ్చజెండా ఊపి శుభాకాంక్షలు తెలుపుతూ సాగనంపారు .
అనంతపురం , చిత్తురు జిల్లాలనుంచి 248 మంది హజ్ యాత్రికులు వెళ్లాల్సి ఉండగా అందులొ 6 గురు సాంకేతిక కారణాలవల్ల ఈరొజు వెళ్లలేక పొయారు . మిగతా 242 మంది హజ్ యాత్రికులు సౌదీ ఎయిర్లైన్స్ ప్రత్యేక విమానంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ మాట్లాడుతూ.. మొదటి విడుత హజ్ యాత్రికుల విమానం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిందన్నారు . బెంగుళూరుకు సమీపంలోఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన అనంతపురం , చిత్తూరు లనుంచి హజ్ యాత్రీకులు ఈ సంవత్సరం బయదేరారన్నారు . ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల పట్ల కర్ణాటక హజ్ కమిటి చైర్మన్ రావుఫుద్దీన్ కచేరీవాలా , సభ్యులు ఎంతో ప్రేమాభిమానాలతో ఆతిధ్య మిచ్చారన్నారన్నారు .
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే తదుపరి విమానాలు ఈనెల 27 , 28 , 30 తేదీల్లో హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నాయన్నారు . గుంటూరు , కర్నూలు జిల్లాలతో 11 మిగతా జిల్లాల 914 హజ్ యాత్రికులు సౌదీ ఎయిర్లైన్స్ విమానాల్లో ట్రిప్పుకు 377 మంది చొప్పున బయలుదేరుతారన్నారు . అంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక స్వీయ పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తరపున హాజ్ యాత్రికులకు అన్నిరకాల సౌకర్యాలను చేశామన్నారు . హజ్ యాత్ర నిమిత్తం వెళ్తున్నా వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దువా చేయడం మర్చిపోవద్దని గౌసల్ ఆజామ్ కోరారు .
ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి సభ్యులూ మొహమ్మద్ నవాజ్ బాషా , హజరత్ వలియుల్లా ఖాదరీ (కడప) మునీర్ బాషా (పులివెందుల ), ఇబాదుల్లా ( రాజమండ్రి ), అబ్దుల్ బసిత్ (గుంటూరు ), కర్ణాటక రాష్ట్ర వక్ప్ బొర్డు చైర్మన్ , సభ్యులు పాల్గొన్నారు . హజ్ యాత్రికుల కు శుభాకాంక్షలు తెలిపేందుకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యతో బంధు ,మిత్రులు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది .