Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం

– కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు
– ఆఫ్ షోర్ మైనింగ్ పైనా ప్రత్యేక దృష్టి
– అర్జెంటీనాలో పలు బ్లాక్ లను వేలంలో దక్కించుకున్నాం
– ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ – 2024లో కేంద్ర గనుల శాఖ పెవిలియన్, కోలిండియా పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం అంతమాత్రానికే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే చెప్పడం అవివేకం. అవినీతి ఎక్కడ జరిగినా, ఏ పార్టీ చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నది మా డిమాండ్.

కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. సీఎం విచారణ కోరారా? మరి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్నట్లు కదా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేం హైకోర్టుకు వెళ్లాం. దీన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరుచేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా?

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహారశైలి తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంది. బీఆర్ఎస్ వైఫల్యాలను, కాంగ్రెస్ పాలనాపరమైన అసమర్ధత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కేంద్రమంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు.

బీఆర్ఎస్ పాలనలో.. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి ప్రతిష్టాత్మకమైన, తెలంగాణ అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే ఫాం హౌజ్ దాటి బయటకు రాని కేసీఆర్, కేటీఆర్ కు కేంద్రమంత్రుల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదు. మేం బీఆర్ఎస్ పక్షం కాదు.. కాంగ్రెస్ పక్షం కాదు.. మేం ప్రజాపక్షం, తెలంగాణ మీడియా పక్షం. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. అనవసరంగా.. ఒకరి ఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి తప్పుగా (అసత్యాలు) మాట్లాడితే ఊరుకోం.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి ఘటనను ఖండిస్తున్నాం.

అధికారులపై దాడులు సరికాదు. ఇందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి తప్ప.. అమాయక గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. ఆయన తన ప్రజలతో మాట్లాడాలి. అంతే తప్ప దీని ద్వారా కూడా రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. సందేహం అక్కర్లేదు. పరిస్థితులు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

భారతదేశం బొగ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతిని, ఆధునిక సాంకేతికత వినియోగం, కార్మికుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను ఈ పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోంది.

ఇంధన భద్రత, సృజనాత్మకత, సుస్థిర మైనింగ్ పద్ధతులు, పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుత మైనింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాం. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ని వినియోగించడం, కార్బన్ ఫుట్-ప్రింట్ ను తగ్గించడం, భారత్ కీ గ్రీన్ ఎనర్జీ గోల్స్ కు అనుగుణంగా పనిచేయడంపై CIL ప్రత్యేక దృష్టిసారించింది. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది. సంవత్సరం పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

బొగ్గు ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా గనుల నిర్వహణ తదితర అంశాలను కోలిండియా టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్తోంది. కార్మికుల భద్రతను ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకుంది. అటు మైనింగ్ లోనూ.. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాం. అదే సమయంలో.. విదేశాల్లో ఉండే క్రిటికల్ మినరల్ బ్లాక్స్ వేలంలో పాల్గొని..అక్కడ ఉత్పత్తి చేసి మన దేశంలో వినియోగించుకునేలా కాబిల్ ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం.

తాజా బడ్జెట్‌లోనూ క్రిటికల్ మినరల్ మిషన్ ను ప్రకటించి.. ఇందుకోసం ప్రత్యేక నిధులను మోదీ సర్కారు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్ లను వేలంలో దక్కించుకున్నాం . అక్కడ ఎక్స్‌ప్లొరేషన్ (తవ్వకాల) పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. దీంతోపాటుగా సముద్రాల్లో ఉన్న మినలర్స్ ను సద్వినియోగం చేసుకునేందుకు.. ఆఫ్ షోర్ మైనింగ్ పైనా ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఆఫ్ షోర్ పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైంది. 2-3 నెలల్లో ఈ బ్లాకుల వేలం వేస్తాం.

LEAVE A RESPONSE