Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం

-తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు
-మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

చంద్రబాబు కి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం.న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం.తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి.జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 53 రోజులు జైలులో ఉండటం చాలా దురదృష్టం. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు పక్క రాష్ట్రాలు భారతదేశ మరియు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు నిరసనలు ఆందోళనలు చేశారు.ఎప్పుడు లేదు ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఆందోళన మరియు ఆగ్రహావేశాలు చూసాము.అన్యాయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉన్నారు అనే బాధ కసి మా లో ఉన్నాయి.

ఈరోజు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని మేమేమి పొంగిపోవడం లేదు మిగిలిన కేసుల్లో కూడా బయలు వస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ తన బినామీల ద్వారా వ్యాపారం చేస్తూ సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కి కోట్లు వెళుతున్నాయి. ఇసుక ద్వారా దాదాపు 40 వేల కోట్ల అవినీతి జరిగిందని మేము ఆధారాలు చూపించాం.

16 నెలలు జైల్లో ఉండి 12 ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఏ మరక లేకుండా ఉన్నారు తనకి కూడా ఏదో ఒక మరొక అంటిస్తే ప్రజల్లో పలచన చేయాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు.

ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి జగన్ పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని నువ్వేదో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కేసులు పెట్టి ఉంటే ప్రజలు ఏమైనా ఆలోచించేవారు ఏమో కానీ ఇంకో నాలుగు నెలల్లో ఎలక్షన్ కి పోతా ఉంటే మమ్మల్ని ప్రజల మధ్యకు వెళ్ళనీయకుండా చేయాలనో, మా శ్రేణులను నిర్వీర్యం చేయాలనో, మా కార్యకర్తల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలి అని తప్పుడు ఆలోచనలతో చేస్తా ఉన్నాడు.ఈ అంశాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు.

మధ్యంతర బెయిల్ కండిషన్లో ఈనెల 28 వరకు అప్లై అవుతాయి. ఆ తర్వాత రెగ్యులర్ బెయిలు. చంద్రబాబు నాయుడు గారు తన పని చేసుకోవచ్చు రాజకీయ మీటింగ్లు కానీ ర్యాలీలు కానీ సభల్లో మాట్లాడటం కానీ చేసుకోవచ్చు. హైకోర్టు వారు చెప్పింది ఏంటి అంటే ఈ కేసు గురించి మాట్లాడవద్దు అని.

ఒక ఎఫ్ ఐ ఆర్ లో పేరు పెట్టినంత మాత్రాన అతను ముద్దాయి అయిపోడు. కానీ ఈ సిఐడి బాస్ సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశమంతా తిరిగి ప్రెస్ మీట్ లు పెట్టి చెప్పారు. దానికి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని మీద కూడా కోర్టు ఒకసారి ఆలోచించాలి. మేం తప్పకుండా కోర్టును అప్రోచ్ అవుతాం ఈ అంశం మీద

42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, ప్రతి రెండు సంవత్సరాలకి మేము సభ్యత్వం చేర్పిస్తాము. వంద రూపాయలు సభ్యత్వం అంటే కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉంటాయి, మాకు కార్యకర్తల సంక్షేమ నిధి ఉంది. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉంది.

అసలు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి వైసీపీ పార్టీకే 150 కోట్ల విరాళాలు ఉన్నాయి. మా దగ్గర 27 కోట్లు ఉండటం పెద్ద విషయం ఏమి కాదు. ఆ లెక్కలన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి చూపిస్తాం. మీ వైసీపీ పార్టీ అకౌంట్ లో ఎన్ని కోట్ల సొమ్ము ఉందో బహిరంగం గా చెప్పండి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు 470 కోట్లు అన్నారు తర్వాత 370 కోట్లు అన్నారు ఆ తర్వాత 250 కోట్లు అన్నారు చివరికి 27 కోట్లు పార్టీ అకౌంట్లోకి వచ్చాయి అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారు.

LEAVE A RESPONSE