Suryaa.co.in

Telangana

కేసీఆర్ ఇచ్చినవే ఇచ్చి డబ్బా కొట్టుకున్నారు

– రైతు బంధు లేదు.. బతుకమ్మ చీరెలు లేవు.. రుణ మాఫీ రాలేదు.
– మెదక్ జిల్లా అందోల్ లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు

అందోల్ : విజయరామరాజు, అల్లం నవాజ్ రెడ్డి వంటి ముఖ్య నాయకులు కోల్పోవడం బాధగా ఉంది.వారి కుటుంబ సభ్యులను నా ప్రగాఢ సానుభూతి. వారు పార్టీకి ఎంతో చేశారు. వారికి నా నివాళి. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని రేపింది అలయ్ బలయ్. పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ. అన్ని కులాల వారు వచ్చి బతుకమ్మ పంచుకోవవడం, గ్రామం గ్రామం అంతా జమ్మి పెట్టుకుంటూ అలయ్ బలయ్ తీసుకునే గొప్ప సంస్కృతి.

కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. సంగారెడ్డి లో కలుషిత నీళ్ళు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మేము మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీళ్ళు ఇస్తే, అది కూడా చేయడం లేదు. రైతు బంధు లేదు, బతుకమ్మ చీరెలు లేవు, రుణ మాఫీ రాలేదు.

డిసెంబర్ 9 పోయింది, పంద్రాగస్టు పోయింది. నిన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. డిసెంబర్ 9 కి రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్నాడు. ఏడాది కాలం గడిపారు. ఏడాది లోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు. కేసీఆర్ ఇచ్చినవే ఇచ్చి డబ్బా కొట్టుకున్నారు.

మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ… భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ రాష్ట్రం నిదర్శనం. అన్ని కులాలు మతాలు ప్రాంతాల ప్రజలు ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నారు. పదేళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసీఆర్ గారి పాలన కొనసాగింది. దేశానికే ఆదర్శంగా నిలిచారు.

LEAVE A RESPONSE