Suryaa.co.in

Andhra Pradesh

అనకాపల్లిలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తాం

– మోడల్ నియోజకవర్గంగా అనకాపల్లి
– ఎంపి సీఎం రమేష్ హామీ
– కశింకోట గ్రామం లో 2.24 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసిన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం రమేష్

అనకాపల్లి: కశింకోట గ్రామం లో అగ్రహారం వీధి నందు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రెండు కోట్ల 24 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పనులకు కూటమి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులతో కలసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కసింకోట గ్రామంలో మూడు కోట్ల 88 లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేటాయించడం జరిగిందన్నారు.దానిలో భాగంగా అగ్రహారం వీధి నందు రెండు కోట్ల రూపాయల పైచిలుకు సీసీ రోడ్ల పనులకు ముందుగా శ్రీకారం చుట్టడం శుభ సూచకం అన్నారు.

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పట్టబోతున్న ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరుగుతాయి అని రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల నిధులతో చేపట్టబోతున్న 30,000 పనులుకు శ్రీకారం చుట్టడం కూటమి విజయం అని వచ్చే 5 యేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రామాణికం అని తెలిపారు.

ఆగస్టు 23న తీసుకున్న నిర్ణయాలను ఈరోజు శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం సహకారనికి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు అదేవిధంగా గత ప్రభుత్వం లో జగన్ మోహన్ రెడ్డి దోచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అని దాదాపు అభివృద్ధికి వెచ్చించాల్సిన 3000 కోట్ల రూపాయలు నిధులను దారి మల్లించారు అని దుయ్యబట్టరు.

కశింకోట గ్రామం ఎన్నికల సమయంలో 4500 పై చిలుకు మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియజేస్తూ గ్రామానికి కావాల్సిన అన్నీ అభివృద్ధి కార్యక్రమలను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానున్నారు. గ్రామానికి సురక్షిత మంచినీటి ప్లాంట్లను ఎన్ని అవసరం ఐతే అన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు.

అదేవిధంగా గ్రామానికి కళ్యాణ మండపం తప్పకుండా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ నిధులు సమకురకపోయిన పరిశ్రమల సి ఎస్ ఆర్ నిధుల సహకారంతో అయిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద్ ,హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ జగదీష్ ,బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు, గ్రామ సర్పంచ్ జయ రంజని, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు డ్వామా పిడి పూర్ణిమ దేవి , మండల ప్రత్యేక అధికారి రోజా రాణి, ఎంపీడీవో రవికుమార్ , ఎమ్మార్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE