– ఎం బాపన్న బాగున్నావ… ఆపరేషన్ మంచిగ అయ్యిందా …
– యదన్న మంచిగా నడుస్తున్నవ… ఒక సారి నడువు యదన్న…
– ఆత్మీయంగా పలకరింపు.. ఆత్మవిశ్వాసం …
– సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్ప మార్పిడి ఆపరేషన్ చేపించుకున్నా వారిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు ..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోకాళ్ళ చిప్ప ఆపరేషన్ లు గాంధీ , ఉస్మానియా ఆసుపత్రి తర్వాత రాష్ట్రంలో జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజ్ లో మొట్టమొదటి సారిగా మన సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి లో మోకాళ్ళ చిప్ప మార్పిడి అపరేషన్ లు జరిగాయి.. గత రెండు నెలల క్రితం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో జరిగిన క్యాంప్ లో 72 మందికి ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు..ఈ మేరకు ఇటీవల ముగ్గురికి మోకాళ్ళ చిప్ప మార్పిడి అపరేషన్ లు చేసారు.
మంగళవారం నాడు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని పరామర్శించి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.. సిద్దిపేట పట్టణానికి చెందిన బాపురెడ్డి తో కాసేపు ముచ్చటించారు.. ” ఎం బాపన్న బాగున్నావ …అపరేషన్ మంచిగ అయ్యిందా అంటూ ఆత్మీయంగా మాట్లాడారు.. అదేవిధంగా యాదగిరి పుల్లూర్ గ్రామానికి చెందిన అతనితో మాట్లాడుతూ …యదన్న మంచిగ నడుస్తున్నావా….!! ఒక సారి నడువు అంటూ నడిపించి ఆత్మవిశ్వాసం నింపారు.. !! మందపల్లి గ్రామానికి యాదయ్య తో ఆత్మీయంగా పలకరించారు.