Suryaa.co.in

Features

కలెక్టర్‌ వారూ నన్ను మరచిపోయారా?

(ఎస్ శ్రీనివాసరావు విజయనగరం)

అయ్యా…. విజయనగరం జిల్లా కలెక్టర్ వారూ…..నన్ను మరచిపోయారు… ఇది మీకు న్యాయమా? జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రివర్యులారా..మీరు కూడా మరచిపోవడం న్యాయమా? విజయనగరం జిల్లా అధికార యoత్రాంగమా…. నన్ను మరచిపోవడం మీకు న్యాయం కాదు కదా.. విజయనగరం జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులారా…. శాసన సభ్యులారా….. జిల్లా పరిషత్ చైర్మన్ వారూ….ఇతర ప్రజాప్రతినిధులారా..మీరు కూడా నన్ను మరచిపోవం తగదు…

హలో..నేనండి…..
నన్ను గుర్తించరూ….ఎవరు అనుకొన్నారా… నేనండి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న బోసిపోయిన జాతీయ జెండాని…

నా చరిత్ర…
నేను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న జాతీయ జెండాని. నన్ను ఒక జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు..

నేను గాలి విస్తే..
రెప రెప లాడుతూ… అందరికీ ఆనందం పంచి ఇచ్ఛే చూడ ముచ్చటగా ఉంటూ మూడు రంగులతో ఎగురుతూ ఉండే జాతీయ జెండాను ..

నన్ను ఎలా గాలికి వదిలేసారో నన్ను చూడండి…

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి కూడా నన్ను గుర్తించకపోవడం మీకు బాధగా లేదా… ఎన్నిసార్లు సిగ్గు విడిచి చెబుతాను నేను…
నేను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉండి భారతీయులకు అండగా ఉండి తెల్ల దొరలను అనగా బ్రిటిష్ వారినుండి విడుదల కలిగించేందుకు నన్ను బహుగా వాడుకొని నేటి వరకు భారత దేశంలో అత్యంత ఆదరణతో నన్ను అందరూ గౌరవిస్తున్నారు.. అయితే విజయనగరం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద ఒకప్పటి జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ గారు నన్ను ఏర్పాటు చేశారు… ఆ తరువాత వచ్చిన జిల్లా కలెక్టర్లు నన్ను పట్టించుకోకుండా గాలికి వదిలేసారు… జాతీయ జెండానైనా నన్ను స్వయానా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ముందే ఇలా నన్ను వదిలేస్తే ఇక మిగిలిన అధికారులు నన్ను ఎలా గౌరవిస్తారు…. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి… నన్ను ఎత్తి పట్టుకొని మన జాతిపిత, స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారి చేతులు నుండి యావత్తు భారత జాతికి విముక్తి కల్గించిన విషయం విజయనగరం జిల్లా అధికారులు మరచిపోవడం న్యాయం కాదు కదా…
నన్ను ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరికి వస్తున్నా… ఇన్నాళ్లు మరచిపోయిన…. ఇప్పుడు అయినా నన్ను గుర్తించకపోవడం
బాధాకరంగా ఉంది నాకు….

ఆగస్టు 15 తేది స్వతంత్ర దినోత్సవం రోజు కూడా మరచిపోవడం విచారకరం….
గల్లీ, గల్లీ లో నన్ను అందరూ గుర్తించి ఓ పండగ వాతావరణం జరుపుకొన్నారు..
ఒక జిల్లా కలెక్టర్ గా తమరు మర్చిపోవడం విచారకరం..

కొందరు నాపై భక్తి భావం ఉన్నవారు ఎన్నిసార్లు విజయనగరం కలెక్టర్ గా మీ దృష్టికి తీసుకోని వచ్చినా ఫలితం లేదు. ఈ బాధ నాలో ఉంది… నాతో పాటు నా పక్కన మీకు కనిపిస్తున్న విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద నిర్మించిన నన్ను ఎలా గౌరవం ఇస్తున్నారు అన్న విషయం గౌరవ జిల్లా కలెక్టర్ గా, జిల్లా అధికార యంత్రాంగం, కానీ గుర్తించకపోవడం విచారకరం.. ఇప్పటి కైనా గుర్తిస్తారని ఓ చిన్ని ఆశ…

ఇట్లు
అనేక వందనాలు తెలియ చేస్తూ…
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఒక జాతీయ జెండాని….

LEAVE A RESPONSE