తనను తాను మార్చుకున్న వ్యక్తి….
అని అందరూ అంటున్నారు…
ఇది నేనెప్పటికీ ఒప్పుకోను…. నిజానికి మారింది తను కాదు…. మనం అంటాను.
తను ఎప్పుడూ ఒకలాగే వున్నాడు. అదే సామర్థ్యం. అదే తెగువ. సమకాలీన సమస్యల పట్ల అదే ఖచ్చితమైన అభిప్రాయం….
మారింది అతని వ్యక్తిత్వం, సమర్థత కాదు… కేవలం రూపం మాత్రమే…
మాలాంటి చాలామందికి మొదటి నుండీ అతని మీద అపారమైన నమ్మకం… బాబుకి తన కుటుంబం కన్నా ఈ రాష్ట్రం మీద ప్రేమే ఎక్కువ. అలాంటి మనిషి ఏ సమర్థత లేకుండా కేవలం కొడుకు మీద ప్రేమతో అతనికి కీలకమైన మంత్రి పదవి ఇచ్చారు అంటే నమ్మలేని విషయం.
నిజానికి మనకన్నా అతని సమర్ధతను గుర్తించింది జగన్ మాత్రమే…. అందుకే అతని మీద వ్యూహాత్మకంగా పప్పు అని ముద్ర వేశాడు….
మనవాళ్ళే అతని రూపాన్ని చూసి మరింతగా ఆ నిందలను ప్రచారం చేశారు. వాడు తెలివిగా మన వేలితో మన కన్నే పొడిచాడు…
ఇప్పటికీ అందరి కళ్ళూ తెరుచుకున్నాయి…
నిజమైన పుత్రోత్సాహాన్ని బాబు ఇప్పుడు అనుభవిస్తున్నారు.