Suryaa.co.in

Political News

ఆయనో రుషి.. అలుపెరుగని కృషి!

ఒకపక్క విపక్షం సూపర్ 6 హామీలు అమలుచేయడం లేదని ఆరోపణలు. మరోపక్క స్వపక్షం అరాచక వైసీపీ నాయకులపై, అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహాలు . ఎవరి అసంతృప్తిలో వారుంటే… నిశ్శబ్దంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు దార్శనికుడు నారా చంద్రబాబునాయుడు!

2014 – 19 లో అప్పటికి దేశంలోనే 13,000 కోట్లతో అతిపెద్ద FDI అయిన కియా ఫ్యాక్టరీ… ఉద్యోగ, ఉపాధి రంగాలలో గేమ్ ఛేంజర్ అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలలలోనే కియాకి 7 రెట్లు పెద్దదైన దేశీయ అతిపెద్ద పెట్టుబడి సాధించారు నారా చంద్రబాబునాయుడు.
పెట్రోకెమికల్ రిఫైనరీ కి సంబంధించి ఎన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయో.. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందుతారో ఆలోచిస్తే… ఆయన పడే కష్టం అర్ధమౌతుంది.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇది ట్రైలర్ మాత్రమే అంటూ…స్టీల్ ప్లాంట్, బయోమాస్ ప్లాంట్లు, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్లు, సెమికండక్టర్ పరిశ్రమలు, ఐటీ & క్లౌడ్ డేటా సెంటర్లు… 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే హామీ.. ఆచరణ సాధ్యం కాదని నిరూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన కష్టానికి ఫలితం దక్కాలని… ఆంధ్రులు అందరూ ఆ ఫలాలు అనుభవించాలని.. నాయుడు అనే నమ్మకం నడిపిస్తోంది ముందుకు!

LEAVE A RESPONSE