..నిర్వాసితులను నిండా నీట ముంచిన జగన్ రెడ్డి
రంపచోడవరం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన సందర్భంగా మంగళవారం రాత్రి మారేడుమిల్లి లో బస చేసినారు. .బుధవారం ఉదయం మారేడుమిల్లి లో కార్యకర్తలు కలుసుకొని అక్కడి నుండి రంపచోడవరం సెంటర్లో ఉన్న నందమూరి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు .
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా దుయ్య పెట్టారు . లోకేష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి గాలి రెడ్డి అని గాలిలోనే హామీలు ఇస్తున్నాడని,పోలవరం నిర్వాసితులకు ఎటువంటి వరదలు వచ్చిన పూర్తిగా ఇల్లు నిర్మాణం అయిన తర్వాత తర్వాత ప్రాజెక్టు పనులు చేపట్టడం జరుగుతుందని గాలిలో హామీలు ఇచ్చారని , నిర్వాసితులను నిండా నీటిలో ముంచి తున్నారని ,అదేవిధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 6,25,000 పరిహారం ఇస్తానంటే గాలి రెడ్డి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తానని జిఓ ఇచ్చిన జీవో ఇప్పటివరకు అమలులోనికి రాలేదంటే నిర్వాసితులను ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు.
అంతేకాకుండా నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరగకుండా పోలీసు అధికారుల సహాయంతో జెసిబి లు పెట్టి భవనాలను కూల్చడం దారుణమని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 11 వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు .అంతేకాకుండా మంత్రివర్యులు కన్నబాబు మాట్లాడుతూ నేను నిర్వాసితులను రెచ్చగొడుతున్నానని ,మాయమాటలు చెబుతున్నానని అంటున్నారు. జగన్ రెడ్డి హామీలు ఇచ్చినప్పుడు పక్కనే మీరు ఉన్నారు కదా !అప్పుడు మీరు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నానని ,అంతేకాకుండా నిర్వాసితుల దగ్గరికి వెళ్ళే ధైర్యం మీకు ఉందా !అని అడుగుతూ ఇప్పటికైనా మీ జగన్ రెడ్డి ని నిర్వాసితులకు ఆన్యాయం చేయకుండా ,నిర్వాసితుల సమస్యలు తీర్చమని మీరు సలహాలు ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిర్వాసితులు మధ్య తిరగాలని చాలెంజ్ చేశారు.
అంతేకాకుండా ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి ఇంకోచేత్తో వంద రూపాయలకు తీసుకుంటున్నాడు. నిత్యవసర వస్తువులైన కిరోసిన్, పంచదార, రేట్లు పెంచుకుంటూ పోతున్నారని ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేస్తున్న ఈ చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గాలి రెడ్డి అని ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల అన్యాయం చేసిన ఈ ముఖ్యమంత్రి అమరావతి పేరు మీద లిక్కర్ తీసుకొచ్చారని ,అదేవిధంగా పోలవరం పేరు మీద కూడా లిక్కర్ తీసు కొస్తాడు ఈ గాలి రెడ్డి అని అన్నారు. చివరి నిర్వాసితులు వరకు ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా మా తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంటుందని ,మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల కష్టసుఖాలు తెలుసుకొమ్మని మమ్మల్ని పంపించడం జరిగిందని రెండు మూడు రోజులలో మా నాయకుడికి నివేదిక ఇస్తామని ,ఆ తర్వాత భారీ ఎత్తున ఆందోళన చేసి ప్రజల కష్టసుఖాలను తీరుస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు .
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన రంపచోడవరం ఐటీడీఏ లో ఐటిడిఏ ఉన్నతాధికారి ఒక గిరిజన మహిళ మాజీ శాసన సభ్యులను కింద పెట్టి కింద కూర్చొని అవమాన పరిచారని త్వరలోనే మా ప్రభుత్వం వస్తుందని అటువంటి అధికారుల పని చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వంతల రాజేశ్వరి ,చిన్నం బాబు రమేష్, వెంకటేశ్వరరావు , అడబాల బాపిరాజు,తీగలప్రభ , నిరంజని దేవి కారం శేషయమ్మ,సత్య కో, పాముఅర్జున్, శివాజీ రాంబాబు కో,ఏడు మండల కార్యకర్తలు,మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప ,నక్కా ఆనందబాబు ,దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు