Suryaa.co.in

Political News

ఆయన తెలంగాణ స్పార్టకస్

అవును ..
ఆయన స్ట్రెచ్చర్ మీద ఉన్న తెలంగాణ వాదానికి ఊపిరి పోసి రాష్ట్రాన్ని డెలివరీ చేసినవాడు.
అవును ..
ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు.
వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు.
నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణ గోదావరి జలాలతో ధూప తీర్చినోడు.
అన్నం మెతుకు దొరకని తెలంగాణను అన్నపూర్ణగా మార్చినోడు.
షాకులు ఇచ్చే కరెంటును సరిచేసి 24 గంటలు వెలుగులు విరజిమ్మేలా చేసినోడు.

బక్క పలసని మనిషైనా ఉక్కు గుండె గలవాడు.
తెర్లయిన తెలంగాణ బతుకులకు తెరచాపై గమ్యం చూపినవాడు.
స్టేచర్ ఉత్తగనే రాదు.. ప్రజలే ప్రాణం అనుకుంటే వస్తది.
మంది మీద పొద్దుపోతే రాదు. మనసు పెట్టి పని చేస్తే వస్తది.
ఆయన ఎన్నడూ నీలాగా పదవుల కోసం పలవరించలే.
గడ్డి పోస లెక్క పదవుల్ని విసిరేసి
తెలంగాణను గెలిచి
ప్రజల హృదయాలను గెలుసుకున్నడు.

స్ట్రెచ్చర్ మీద ఉన్న తెలంగాణను ఆయన జీవగంజి పోసి బతికిస్తే,
నువ్వు అదే తెలంగాణను మార్చురీకి పంపే ప్రయత్నం చేస్తున్నవ్.
కెసిఆర్ తెలంగాణ పతారా పెంచి ప్రపంచంతో పోటీపడి పనిచేస్తే
నువ్వు చౌకబారు మాటలతో చేతకాక దివాళా తీయస్తున్నవ్.
వెయ్యి ఏనుగుల బలాన్ని కూడదీసుకొని మళ్ళీ వస్తాడు.
నిన్నూ,నిన్ను ఆడిస్తున్న వాళ్ళ ఆట కట్టిస్తాడు.
తిరిగి తెలంగాణను నిలబెట్టి గెలిపిస్తాడు.
ఎక్కడ ఉన్నా ఆయన కెసిఆర్
తెలంగాణ స్పార్టకస్

– సిద్ధం వేణు
మాజీ ఉపాధ్యక్షులు-
జిల్లా ప్రజా పరిషత్
రాజన్న సిరిసిల్ల.

LEAVE A RESPONSE