Suryaa.co.in

Political News

ఆయన నలభై నాలుగేళ్ల క్రితమే హైటెక్!

( ప్రేంచౌదరి)
ఆయన ఎంత హైటెక్కో .. 44 సంవత్సరాల క్రితం జరిగిన ఈ వాస్తవ సంఘటన..ఆధారంగా తెలుస్తుంది.
S.V.యూనివర్సిటీలో ఆయన N.S.U.I నాయకుడిగా ఉండేవారు.అది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంవత్సరం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిరుపతికి వస్తున్నారు,స్వాగత ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూడాలని బాబుకి ఆయన రాజకీయ గురువు రాజగోపాల్ నాయుడు చెప్పారు.
ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటా. మీరు మీ కార్యక్రమాలు చూసుకోండని బాబు రాజగోపాల్ నాయుడు కి చెప్పడంతో, ఈయన కార్యదక్షత నాయుడుకి తెలుసు కనుక ధీమాగా ఉన్నారు.
వచ్చేది ప్రధానమంత్రి అందునా ఇందిరాగాంధీ… ఆమెకు అందరిలా .. ఎప్పటిలా .. రొటీన్ గా కాకుండా, వినూత్నమైన రీతిలో గ్రాండ్ WELCOME చెప్పాలని నిర్ణయించుకున్నారు బాబు.
అనుకున్నదే తడవుగా ఆయనకొక ఉపాయం తట్టింది.(ఆ IDEAనే ఆయన భవిష్యత్తుకు కాంతిరేఖ అని అప్పటికి బాబుకి తెలియదు.)సరే అ ఉపాయాన్ని ఆచరణలో పెట్టడానికి అప్పటి సహచరులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు,బొజ్జల గోపాలకృష్ణా రెడ్ధి మరియు కొందరు మిత్రులతో పాటు, తమ్ముడు రామ్మూర్తి నాయుడు లతో ఓ ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేశారు.
ఆంతరంగిక సమావేశం ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఎక్కడైనా రెండు గ్రూపులు ఉంటాయిగా.. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఓ గ్రూప్ లీడర్ రాజగోపాల్ నాయుడు గారయితే , మరో గ్రూప్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాధ్ రెడ్డి గారు.వీళ్ళ Plan ఆ వర్గానికి తెలియకుండా ఉండేందుకే ఆ రహస్యశమావేశం.
ఆ సమావేశంలో బాబు ఆలోచన సహచరులతో SHARE చేసుకున్నారు వారు కూడా అది చాలా వినూత్నమైన ఆలోచన. తప్పకుండా మనం సక్సెస్ చేసితీరాలి అని సంకల్పించుకున్నారు.
వెంటనే తిరుపతి పరిసర ప్రాంతాలని కొన్ని రూట్లుగా విభజించుకుని, ఒక్కో రూటుకు ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పి, మరుసటి రోజు కోయంబత్తూరు Train ఎక్కారు చంద్రబాబు.
కోయంబత్తూరు ఎందుకంటారా .. అప్పట్లో T-షర్టుల మీద పేర్లు ప్రింట్ చేసే టెక్నాలజీ అక్కడే ఉండేది మరి. T-షర్టుల మీద చంద్రబాబు నాయుడు NSUI అని పేరు ప్రింట్ చేపించుకున్న “తొలిఘనుడు” కూడా నేటి మన బాబుమరి.
ఆ రోజుల్లో 2-వీలర్సంటే సైకిళ్ళు కాక సువేగా,హీరో మెజస్టిక్ మోపెడ్లు ఎక్కువ వాడేవారు ఎవరో బాగా సంపన్నులయితేనే RAJDOOTH,YEZDI,JAWA మోటార్ సైకిళ్ళు వాడేవారు.కానీ వాటితో బైక్ ర్యాలీలు భారీగా జరిగినట్లు భారతదేశ చరిత్రలో లేదు.
లేనిది సృష్టించడమేగా బాబు SPECIALITY.
తిరుపతిలోని బైక్ షోరూంలతో పాటు,మెకానిక్ షెడ్లకి వెళ్ళి ఈ బైక్ లు వాడేవారి వివరాలు సేకరించి, ఎక్కడెక్కడో ఉన్న వారి ఇళ్ళకు వెళ్ళి BIKE తో సహా వారు ర్యాలీలో పాల్గొనేలా ఒప్పంచడమే బాబు టీమ్ మెంబర్ల పని.
మొత్తం మీద విపరీతంగా శ్రమించి, సేకరించిన 300 మోటార్ సైకిళ్ళతో ర్యాలీ ప్లాన్ చేసి… ఆ ర్యాలీ కూడా ఇందిరాగాంధీ తిరుపతిలో ప్రయాణించే Open Top జీప్ ముందే ఉండేలా చూడాలన్న బాధ్యతను రాజగోపాల్ నాయుడు మీద నెట్టేశారు.
మొత్తానికి ప్రధానమంత్రి రక్షణ సిబ్బందితో మాట్లాడారో,ఇందిరాగాంధీ తోనే మాట్లాడారో గానీ, PRIME MINISTER వాహనం ఎదురుగా, అంత భారీ ర్యాలీకి అనుమతివడం కూడా అప్పట్లో ఓ రికార్డ్ అని చెప్పుకునేవారంట.
ర్యాలీకి అనుకున్న విధంగా పర్మిషన్ రావడంతో, రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగిన బాబు.. తనకి ముందు 300 BIKE లు ఉండేలా PRIME MINISTER ఓపెన్ టాప్ జీప్ ముందు తాను ఉండేలా ప్లాన్ చేసుకొని, RED కలర్ BULLET మీద రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రధానమంత్రిని ఘన స్వాగతంతో తిరుపతి పట్టణంలో తిప్పారు.
ఆ స్వాగతానికి ముగ్దురాలైన ఇందిరాగాంధీ ఈ ర్యాలీ ఎవరు ఏర్పాటు చేశారు? Red బుల్లెట్ మీద తిరిగిన కుర్రోడు ఎవరని రాజగోపాల్ నాయుడు ని అడిగితే … ఈ ర్యాలీ ప్లాన్ ,సక్సెస్ చేయడం మొత్తం బాధ్యత ఆ కుర్రోడే చూసుకున్నాడు అతని పేరు చంద్రభాబు నాయుడు NSUI ప్రెసిడెంట్ అని చెప్పారంట.
వెంటనే ఆవిడ బాబు ని పిలిపించుకుని అభినందనలు తెలిపి, వచ్చే వారం ఢిల్లీ వచ్చి తనని కలవమని అపాయింట్ మెంట్ ఇచ్చేశారు.
ఆ తర్వాత భాబు డిల్లీ వెళ్ళడం , అక్కడ ఆయనను చంద్రగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేసి B-form ఇవ్వమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయి.
ఈ పరిణామాలన్నింటికీ ఖంగుతిన్న N.అమర్ నాధ్ రెడ్డి బాబు కి సీటివకుండా అడ్డుకోవాలని, సీటు వచ్చాక కూడా ఆయనని ఓడించాలని చేయని ప్రయత్నాల్లేవంటే అతిశయోక్తి కాదు.
ఇందిరాగాంధీ కి డైరెక్ట్ క్యాండిడేట్ అనేనేమో, తొలిసారి M.LA. కాగానే అడక్కుండానే BONUS గా మంత్రి పదవి కూడా ఇచ్చేశారు బాబుకి.
కొసమెరుపు:- తన ప్రతిభా పాటవాలతో తొలిసారే ఇందిరాగాంధీ అంతటి వ్యక్తిని INSPIRE చేసిన బాబు కాలక్రమంలో, అవిడతోనే పోరాడాల్సి రావడం.. దేనినైనా ఎదుర్కోగల సత్తాగల వ్యక్తిత్వం ఆయనది.అలాంటి ఆయనకి ఈ పిల్ల జఫాగాళ్ళొక లెక్కా.
(మిత్రుడు Raghu Ram చెప్పిన సమాచారం ఆధారంగా క్రియోట్ చేసిన పోస్ట్)

LEAVE A RESPONSE