Suryaa.co.in

Andhra Pradesh

తల్లి, చెల్లికి న్యాయం చెయ్యలేని వాడు పులివెందుల కు న్యాయం ఏమి చేస్తాడు?

-సొంత బాబాయ్ ని చంపేసిన వాడు జగన్
-ఇబ్బంది పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తొలగిస్తాం
-నియోజకవర్గంలో పనిచేయకుండా పదవులు అడగొద్దు
-పులి వేటకి వెళ్లకపోతే పిల్లి అవుతుంది
-పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే
-ప్రజా సమస్యల పై పోరాడినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు
-ఓడిపోయినా ఇంఛార్జ్ గా ఉండి పెత్తనం చెయ్యాలి అనుకుంటే ఇక కుదరదు
-ఇంఛార్జ్ వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం
-కడప జిల్లా పులివెందుల టిడిపి కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన నారా లోకేష్

పులివెందులలో గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందుల ను అభివృద్ధి చేసాం.పులివెందులకు నీరు ఇచ్చింది టిడిపి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసాం.రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ కల్పించాం. ఎన్నో పదవులు ఇచ్చాం.

జగన్ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు.పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే.బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు అనుకున్న మేర పులివెందులలో జరగలేదు.మనలో మార్పు రావాలి ప్రజలకి దగ్గర అవ్వాలి.ప్రజా సమస్యల పై పోరాడినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు.

90 వేల మెజారిటీ లో గెలిపించినందుకు జగన్ పులివెందులకు చేసింది ఎంటి?ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడు? రోడ్లు వేసాడా? కోట్ల రూపాయలు మంజూరు చేశాను అంటున్నాడు. ఒక్క రూపాయి విడుదల చేసాడా? జయంతి, వర్ధంతి కి తప్ప జగన్ పులివెందులకు చేసింది ఎంటి? నా సూటి ప్రశ్న.

సీనియర్, జూనియర్లు ను సమానంగా గౌరవిస్తా. కానీ పని చేసే వారికే పదవులు ఇస్తా. మీ బూత్ లో మెజారిటీ తెస్తేనే పదవులు ఇస్తాం.నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి.కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటాం అంటే ప్రజలు హర్షించరు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుంది.గ్రూప్ రాజకీయాలని ప్రోత్సహించం.

భవిష్యత్తు కి గ్యారెంటీ కార్యక్రమం పులివెందుల లో పక్కగా నిర్వహించాలి.నియోజవర్గంలో పనిచేయకుండా పదవులు అడగొద్దు.కడప జిల్లా లో టిడిపి కి పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలి.పులి వేటకి వెళ్లకపోతే పిల్లి అవుతుంది. టిడిపి నాయకులు అంతా పోరాడాలి.

పులివెందుల లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఏమి జరగడం లేదు.నాడు – నేడు పేరుతో హడావిడి తప్ప పులివెందుల స్కూళ్ల లో కనీసం మౌలిక వసతులు లేవు.వందల కోట్ల తో రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాడు జగన్. ఒక్క రోడ్డు కూడా పూర్తి చెయ్యలేదు. పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంలో వేయాల్సిన రోడ్లు పూర్తి చెయ్యలేదు. కనీసం అదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు జగన్ అందించలేదు.

పులివెందులకు చెందిన నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించాం. ఓడిపోయినా ఇంఛార్జ్ గా ఉండి పెత్తనం చెయ్యాలి అనుకుంటే ఇక కుదరదు. ఇంఛార్జ్ వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తొలగిస్తాం. ఢీ అంటే ఢీ అనే వాళ్ళనే నేను గుర్తిస్తా.

మిషన్ రాయలసీమ లో భాగంగా పులివెందులకు కూడా పరిశ్రమలు తీసుకొస్తాం.జగన్ మైక్రో ఇరిగేషన్ అంటూ హడావిడి చేశాడు. ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు ఎక్కువ శాతం పరిశ్రమలు అన్ని రాయలసీమకే వచ్చాయి.

LEAVE A RESPONSE