– కేసీఆర్ తెలంగాణ లో ఉన్న దళితులకు అండగా ఉండేందుకే విగ్రహం పెట్టాలె.. దేశ వ్యాప్తంగా ఉన్న దళితులకు , బహుజనులకు , మైనార్టీలకు , బీసీలకు ఇలా అందరికి కూడా అండగా ఉండాలని , అందరికి అంబేద్కర్ స్ఫూర్తిని అందించాలని విగ్రహం పెట్టారు
– ఉత్తరప్రదేశ్ లో దాదాపు 70 వేల మంది దళితులపై అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి. వారిని అడిగే నాధుడు లేడు..? ఈనాడు దళిత అభ్యుదయం కోసం పాటుపడుతున్నకేసీఆర్ పైన బిజెపి నేతలు దాడిచేస్తున్నారు
– మోడీ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.
– ఇప్పుడు 9 ఏళ్లు అయ్యింది. అంటే 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి..కానీ 18 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తున్నాడు
– సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఏప్రిల్ 15 : BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్నా యకత్వంలో ఈ రోజు వి ఎస్ టి ఫంక్షన్ హాల్లో రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాంనగర్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, జై సింహ, మాజీ కార్పొరేటర్ పద్మ, రవీందర్, రాజేందర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 125 అడుగుల డా. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది మాములు విగ్రహం కాదు స్ఫూర్తి విగ్రహం. దీనిని చూసి ఓర్వలేక కేసీఆర్ ఫై బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా 70 ఏళ్లు కావొస్తున్నా..భారత రాజ్యాంగం అమల్లో ఉన్న.. ఇంకా చాల చోట్ల అంటరానితనం ఉంది. అణగదొక్కబడిన వర్గాలను ఇంకా అణిచివేస్తున్నారు. ముఖ్యంగా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ లో ఉన్న దళితులకు అండగా ఉండేందుకే విగ్రహం పెట్టాలె.. దేశ వ్యాప్తంగా ఉన్న దళితులకు , బహుజనులకు , మైనార్టీలకు , బీసీలకు ఇలా అందరికి కూడా అండగా ఉండాలని , అందరికి అంబేద్కర్ స్ఫూర్తిని అందించాలని విగ్రహం పెట్టారు. ఇది చూసి ఓర్వలేక బిజెపి నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటూ , కేసీఆర్ ఫై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. ఈనాడు మాయమాటలు చెప్పి మనదగ్గరికి వస్తున్నారు. బిజెపి పాలిస్తున్న ప్రాంతాలలో ఎంతమేర అభివృద్ధి జరుగుతుందో గమనించాలి.. బండి సంజయ్ మారే ఇతర బిజెపి నేతలు చిల్లరగా మాట్లాడితే వారి చొక్కా పట్టుకొని నిలదీయాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్ లో దాదాపు 70 వేల మంది దళితులపై అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి. వారిని అడిగే నాధుడు లేడు. SC , ST చట్టాలను తుంగలో తొక్కే ప్రయత్నం చేశారు. దళిత మహిళలఫై ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్న వారిని అడిగే వారు లేరు. కేసీఆర్ ఫైన , కేసీఆర్ అభివృద్ధి పైన , దళిత అభ్యుదయం కోసం పనిచేస్తున్న కేసీఆర్ పైన ఈనాడు బిజెపి నేతలు దాడిచేస్తున్నారు. బిజెపి పాలిస్తున్న చోట ఎంత దారుణంగా ఉందొ ప్రతి ఒక్కరు ప్రజలకు తెలియజెప్పాలి. ఈరోజు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎవరైనా కాస్త మీసం పెంచినట్లు కనిపిస్తే గుండ్లు కొట్టిస్తున్నారు…బట్టలు విప్పించి తిప్పుతున్నారు..చెట్లకు కట్టి కొడుతున్నారు..ఏందిరా దళితుడా నువ్వు ఎందుకు మీసం పెంచుకుంటున్నావు..పెంచుకుంటే మీము రాజపుత్రులం..బిజెపి వాళ్లం ..మీము పెంచుకోవాలి కానీ ..మీరు ఎందుకు పెంచుకుంటున్నారా..? అంటూ వేధిస్తున్నారు.
కేసీఆర్ దళితులను దేవుళ్లుగా కొలుస్తూ..వారికోసం అనేక పథకాలు తీసుకొస్తూ వారి అభ్యుదయం కోసం పాటు పడుతూ అంబేద్కర్ విగ్రహం పెడితే.. మీరు ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని బిజెపి నేతలను అడగాల్సిన అవసరం ఉంది. మోడీ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు..ఇప్పుడు 9 ఏళ్లు అయ్యింది. అంటే 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి..కానీ 18 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తున్నాడు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులకు అన్యాయం చేస్తూ..వారిని హింసిస్తున్న వాడు దళితద్రోహా..? దళితుల కోసం..వారి అభ్యుదయం కోసం పాటుపడుతున్న కేసీఆర్ దళితద్రోహా..? అనేది మీరే గ్రహించుకోవాలి. రూ.400 గ్యాస్ ధరను రూ. 1100 చేసిన దుర్మర్గుడు మోడీ..పెట్టుబడిదారుల కోసం పెట్రోల్ , గ్యాస్ ధరలు పెంచి ప్రజలను పేదిరికంలో ఉంచుతున్న ద్రోహి మోడీ అంటూ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అలాంటి మోడీకి గుణపాఠం చెప్పాలంటే..కేసీఆర్ మూడో సారి అధికారంలోకి రావాలి. ప్రతి ఒక్కరు కేసీఆర్ అందిస్తున్న ఏదొక సంక్షేమ పథకం నుండి లబ్ది పొందుతున్నారు. అలాంటి సంక్షేమ పధకాలు అందజేస్తున్న కేసీఆర్ గురించి , అయన తీసుకొచ్చిన అభివృద్ధి గురించి ప్రతి రోజు మాట్లాడుకుంటూ..పది మందికి తెలియజెపుతూ, మూడోసారి ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ సూచించారు.