దేవుడు ఎక్కడో ఉండడు
మనమధ్యే ఉంటాడు
మనతోనే ఉంటాడు..
మనకు కావాల్సింది చేస్తాడు
మనం కోరుకున్నదే ఇస్తాడు
గుడికి వెళ్లినప్పుడు
సాయం చేయ్ నీవే రాముడి
చర్చికి వెళ్లి చంద ఇస్తే వాడకి నీవే జీసెస్
మసీదుకు వెళ్లి సాయం చేయి
వారికి నీవే అల్లాహ్ అవుతావు
ఎప్పుడైనా ఎవరికైనా
సాయం చేసినప్పుడు
ప్రతివారూ అనేమాట
దేవుడిలా వచ్చి
ఆదుకున్నావంటారు..
గుర్తుకొచ్చిందా..
సాయమంటేనే దేవుడు..
అది మాట రూపంలోనే కావొచ్చు
వస్తు రూపేణా ఐనా కావొచ్చు
దేవుడంటే సాయం మాత్రమే
సాయం అంటేనే దేవుడు
కాబట్టి నీకున్న దానిలో
ఎదుట వారికి సాయం చేస్తే
నీలోనే దేవుడుంటాడని మర్చిపోవొద్దు నేస్తమా ….!!
– రాజేశ్వరరావు కొండా
సీనియర్ జర్నలిస్టు