విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు.
ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుధాకర్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు.
శ్రీసాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకులు వి.సతీష్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు
జంగారెడ్డిగూడెంకు చెందిన విద్య వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి.సతీష్, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.
సాయిరమ సివిల్ కన్ స్ట్రక్షన్స్ అధినేత గోవిందరావు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.
ఎస్.పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎమ్.శేషావలి రూ.3 లక్షలు విరాళం అందజేశారు.
గుంటూరుకు చెందిన కండే మహాలక్ష్మి, కండే రాకేష్ రూ.25వేలు విరాళం అందజేశారు
గోపాలపురం నియోజకవర్గం చిన్నాయగూడెంకు చెందిన కందుల సతీష్ రూ.20వేలు విరాళం అందజేశారు.
ఆర్.శివ నాగిరెడ్డి రూ.10,116 విరాళం అందజేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.