Suryaa.co.in

Features

ఆమె జీవితం ఒక గుణపాఠం!

నిర్భాగ్యురాలు జయలలిత వెళ్ళిపోయింది..పెళ్ళి లేదు..పిల్లలు లేరు. అనుభవించే వారసులు లేరు..ఒకరి మాట వినని నియంతృత్వం. దురాశ తో ఎంత సంపాదించి ఏమి లాభం..?ఆవిడ ఒక్క చిన్నమెత్తు కూడా తనతో తీసుకు వెళ్ళలేదు. ప్రజల సొమ్ము పదకాల పేరుతో తో ప్రజలకు పెట్టడం తప్ప, ఎంత సంపాదించిన ప్రజలకు తన సొంత సొమ్ము ఎవరికి ఇవ్వలేదు.

ఎంతో చురుకైన జయలలిత తమిళనాడు ను పాలించిన విషయం ఇప్పుడు, కేవలం గుర్తుగా మి మిగిలిపోయింది. ఇప్పటికైతే ఆరడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వితంగా స్థానం ఆక్రమించి, తనకున్న వేల ఎకరాలు వదిలిపెట్టి వేసింది. ఆవిడ కేవలం ఒక శవ వాహక వాహనం లో ప్రయాణం చేసి గమ్యం చేరుకుంది, తనకున్న కార్లు, పొలాలు, స్తళాలు భవంతులన్ని వదిలి వేసి.. ఆవిడ సంపాదించిన ఆస్తి చాలా పెద్దది. లిస్టు ఇస్తాను మీకు.

తిరునెల్వేలి లో 1197 ఎకరాలు రెండు వందల ఎకరాలు వలజాపేట్ట 100 ఎకరాలు ఒత్తుకొట్ట 25 ఎకరాలు షిరుత్త వూర్ ఒక చోట 200 ఎకరాలు మరొకచోట 100 ఎకరాలు కాంచీపురం లో.. 14.5 ఎకరాల ద్రాక్షతోట జీడిమెట్లలో (తెలంగాణాలో) kodanad టీ ఎస్టేట్ 1,600 ఎకరాలు (బంగ్లాలు కూడా) మొత్తం నీలగిరి లో ఉన్నాయి.. ఇవి కాక 24,000 చ”అ” వేదనిలయం అనేపేరుతో (పోయస్ గార్డెన్) కనీస ఖరీదు 100 కోట్లు కమర్షియల్ భవనాలు ఒకటి చెన్నయ్, ఒకటి హైద్రాబాద్ 800 కిలోల వెండి 28 కిలోల బంగారం 750 జతలు చెప్పులు (లేక బూట్స్) 10,500 ఖరీదైన చీరలు 91 వాచీలు 2 టయోట Prado SUVs టెంపో ట్రావెలర్ టెంపో ట్రాక్స్ మహేంద్రా జీప్ అంబాసిడర్ కార్ మహేంద్రా బోకెరు స్వరాజ్ మర్జ్డా మాక్స్ కొంటెస్సా పై తొమ్మిది వెహికల్స్ ఖరీదు సుమారు రూ”42, 25,000/- (1997 కి) బినామీ ఆస్తులు చేర్చబడలేదు.

ఆమె జీవితం ప్రపంచంలోని వారికి ఒక గుణపాఠం. భగవంతుడు నుంచి పిలుపు రాగానే ఉన్నది ఉన్నట్టు వదిలిపెట్టి వెళ్ళాలి అని . *కనీసం దగ్గర వారికి వస్తా అని చెప్పే అవకాశం కూడా దొరక్కపోవచ్చు..ఎవరూ రక్షించలేరు ఎవరు సహాయం చేయలేరు.

( సేకరణ)

LEAVE A RESPONSE