హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేశాడు అనే పిచ్చోళ్ళకు..
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు 17 డిసెంబరు 1990 నుంచి 9 అక్టోబర్ 1992 వరకు 22 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పి.వి. నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలలో భాగంగా, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు 1991 మే నెలలో మాదాపూర్‌లోని ఇప్పటి కావూరి హిల్స్ పక్కన ఉన్న ప్రాంతంలో ‘రాజీవ్ గాంధీ టెక్ పార్క్’ కు ఫౌండేషన్ స్టోన్ వేశారు.
దీనిని ₹4.5 కోట్లతో పూర్తి చేయాలని, అందులో ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగిలినది కేంద్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించారు. అయితే 1992 జూలైలో వచ్చిన భారీ వర్షాలకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు వేసిన ఆ ఫౌండేషన్ స్టోన్ కూలిపోయింది. ఆ తర్వాత మూడు నెలలకే ఆయన పదవి పోయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన 12 డిసెంబరు 1994 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఎన్టీ రామారావు గారు 1 సెప్టెంబర్ 1995 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1991వ సంవత్సరంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ 1992లోనే కూలిపోయింది. 1 సెప్టెంబర్ 1995న అంటే 4 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు కూడా వెంటనే హైటెక్ సిటీ నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు.
ఆయన 1996లో మొదటిసారి ఇప్పుడు హైటెక్ సిటీగా పిలిచే కొండలు, గచ్చిబౌలి, గౌలిదొడ్డి, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్, మణికొండ, రాయదుర్గ్ వంటి అడవి ప్రాంతాలకు వెళ్ళారు. 1 ఆగస్టు 1997లో సైబర్ టవర్స్‌కు పునాదిరాయి వేశారు. ఆ ప్రాంతానికి ‘హైటెక్ సిటీ’ అనే పేరు పెట్టారు. కేవలం 14 నెలల్లోనే, అంటే 1998 నవంబర్ 22న సైబర్ టవర్స్ పూర్తి చేయడమే కాకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అంతేకాకుండా ఆ 14 నెలల్లోనే 300 ఎకరాల్లో హైటెక్ సిటీలో కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వంటి ఇతర నిర్మాణాలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దారు.
ఇక్కడ నుంచే హైదరాబాద్‌లో ఐటీ స్వర్ణయుగం మొదలైంది. 1998లో స్పష్టమైన ‘విజన్ 2020’ డాక్యుమెంటును రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. విజన్ 2020 డాక్యుమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు రూపొందించి సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిని పరుగులు తీయించారు. మొదట 300 ఎకరాల్లో హైటెక్ సిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు, ఆ తర్వాత 15,000 ఎకరాల్లో ‘సైబరాబాద్’ ను రూపొందించారు.
అప్పుడే ఎక్కడ ఐటీ హబ్‌లు ఉండాలో, ఎక్కడ కమర్షియల్ హబ్‌లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండాలో, వాటికి రోడ్లు ఎలా ఉండాలో వివరిస్తూ చంద్రబాబు గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, MMTS.. ఇవన్నీ విజన్ 2020లో భాగమే.
2001లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న ప్రధాన ఐటీ హబ్‌లన్నీ 2000-2004 మధ్య కాలంలో ప్రారంభించినవి లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే.
అప్పట్లోనే ₹33 వేల కోట్ల విలువైన ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆయన తీసుకువచ్చారు. సైబర్ టవర్స్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోసిటీ, CII, సైబర్ గేట్‌వే, సైబర్ పెరల్, మైండ్ స్పేస్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC), హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ (HITEX), విప్రో, ఒరాకిల్, ఇన్ఫోసిస్, TCS, ISB.. మొదలైనవన్నీ ఆయన కృషి ఫలితమే.
మీకు తెలుసా? అమెజాన్ 2004లోనే తన సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, 2019లో ప్రపంచంలోనే తన అతిపెద్ద టెక్ పార్కును ఇక్కడ నిర్మించుకుంది. ఇలా చంద్రబాబు గారు తెచ్చిన కంపెనీల జాబితా చెప్పాలంటే ఇక్కడ సరిపోవు.
చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి “కంప్యూటర్లు కూడు పెడతాయా?” అని ఎగతాళి చేసి, ఒకానొక దశలో ఐటీ కంపెనీలకు అనుమతులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ విదేశీ పెట్టుబడుల చట్టాల ఉల్లంఘన చేయలేక, మన్మోహన్ సింగ్ గారు వేసిన అక్షింతల కారణంగా చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గార్లు కూడా సైబరాబాద్ అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గలేదు.
అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, మంత్రి కేటీఆర్.. సైబరాబాద్‌లో మొదట్లో లొల్లి చేద్దామనుకున్నా, అక్కడ అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మరియు భారీ పెట్టుబడులు ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. ఫలితంగా చంద్రబాబు గారి ‘విజన్ 2020’ని వారూ ముందుకు తీసుకువెళ్లక తప్పలేదు.
చరిత్రను మార్చలేం.. వాస్తవాలను దాచలేం!
ఏదైనా ఒక ప్రాజెక్టుకు పునాది రాయి వేయడం వేరు, ఆ ప్రాజెక్టు కోసం ఒక విజన్‌ను సృష్టించి, ప్రపంచ స్థాయి సంస్థలను ఒప్పించి, రాళ్లు రప్పలు ఉన్న చోట, “కంప్యూటర్లు కూడు పెడతాయి” అని ఎక్కిరించిన వారిని దాటుకొని అసాధ్యమనుకున్న చోట ఒక నగరాన్ని నిర్మించడం వేరు.
రేవంత్ రెడ్డి గారు తమ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ వేసింది అని చెప్పుకోవడానికి నేదురుమల్లి గారి పేరు ఎత్తితే, కేసీఆర్, జగన్ వంటి వారు చంద్రబాబు పేరు ఉండకూడదని నేదురుమల్లి పేరును వాడుకుంటున్నారు. 1991లో వేసిన ఒక చిన్న టెక్ పార్క్ పునాది రాయి 1992లో వర్షానికి కొట్టుకుపోతే, 1997లో చంద్రబాబు గారు వేసిన పునాది నేడు లక్షలాది మందికి ఉపాధినిచ్చే మహా వృక్షమై నిలబడింది.