Suryaa.co.in

Telangana

పార్కింగ్ దందాపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది . ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, మాల్స్, సినిమా థియేటర్లు, ఇతర బహుళ అంతస్తుల భవనాల్లో సాగుతున్న పార్కింగ్ దందాపై సమాధానం చెప్పాలని ఆదేశించింది . సీహెచ్ మదన్ మోహన్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ‘ కేసులో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ భారీగా వసూలు చేస్తున్నారు . దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి , జస్టిస్ ఎ.అభిషేకెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన ధర్మాసనం వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత భవనాల యజమానులపై ఉంటుందని స్పష్టం చేసింది . హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఎందుకు అమలు చేయడం లేదో వివరించాలని ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A RESPONSE