వేణు స్వామికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారంలోగా వేణు కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం రోజే.. విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పారు.
దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదుమేరకు విచారణకు రావాలని మహిళా కమిషన్ ఆయనను ఆదేశించింది. దీంతో కమిషన్ కు అధికారంలేదని వేణు స్టే తెచ్చుకోగా.. తాజాగా దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.