– కేసులు ఎలా తొలగిస్తారని ప్రశ్న
– డీజీపీ, హోం సెక్రటరీలకు నోటీసులు
కేసుల ఉపసంహరణ వ్యవహారంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు. ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం జీవోఇవ్వాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఉదయభాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడువారాల్లో కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.