పుట్టబోయే బిడ్డపైనా జగన్ రెడ్డి అప్పు

– రెండున్నరేళ్లలో చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లు
– ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం
– మాజీ మంత్రి కళా వెంకట్రావు
జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారు. రెండున్నరేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారు. జగన్ రెడ్డి దుబారా, అవినీతి, మితిమీరిన అప్పుల కారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అప్పు మోపారు. తమ అవినీతి, దుబారా కోసం ధరల పెంపు, పన్నుల పెంపు, అప్పుల పెంపుతో రాష్ట్ర ప్రజానీకంపై మోయలేని భారం మోపారు. చంద్రబాబునాయుడు పాలనలో శిశువు జన్మించినప్పటి నుంచి వారి బాగోగుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయగా.. నేడు పుట్టబోయే బిడ్డపైనా జగన్ రెడ్డి అప్పులు భారం మోపుతున్నారు.
సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు తాగే టీ కి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందంటే.. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసం చేశారో అర్థమవుతోంది. చంద్రన్న పాలనలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ రెడ్డి పాలనలో రూ.5000కు పెంచారు. భారతి సిమెంట్ కంపెనీ లాభాల కోసం బస్తా సిమెంట్ ధరను రూ.430కి పెంచారు. నాసిరకమైన మద్యం పోస్తూ.. క్వార్టర్ మద్యంపై రూ.250 పెంచారు. ఒక్క మద్యంలో ఏడాదికి రూ.5వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ముడుపులు దండుకుంటున్నారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. 6 సార్లు పెంచారు. బిల్లులు రెట్టింపు చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.36 వేల కోట్ల భారం వేసి దోచుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి రూ.2 వేల కోట్ల భారం ప్రజలపై మోపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది.

Leave a Reply