– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
– శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుచున్న శ్రీరామనవమి శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీకి గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ నందు ఘన స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బిజెపి మరియు హిందూ చైతన్య వేదిక శ్రేణులు
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమన్నారంటే.. ఏపీలో హిందూ చైతన్య భావన వ్యక్తం అవుతుంది.రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని కలిపే విధంగా శోభా యాత్ర జరుగుతుంది.శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేయడం ఆనందం.పార్టీలకు అతీతంగా శోభాయాత్ర చేయడం విశేషం.వేలాది మంది శోభాయాత్రలో పాల్గొవడంలో హిందువులు ప్రధాన పాత్ర పోషించారు.రాష్ట్రంలో హిందు సంప్రదాయాలను పాటిస్తూ చైతన్య వంతంగా సాగుతున్నారు. ఎవరికివారే స్వచ్ఛందంగా పాల్గొనటం చూస్తుంటే గర్వాంగా ఉంది. భారతీయ సంస్కృతిలో హిందూ సంస్కృతి కి ప్రత్యేక స్థానం ఉంది. భారత్ నేడు దేశవ్యాప్తంగా పెద్దదిక్కుగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా హిందూ సంప్రదాయాలను అణగ దొక్కటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
శంకర్ లాస్ సెంటర్ నందు శోభాయాత్రకు స్వాగతం పలికిన వారిలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, జూపుడి రంగరాజు, చందు సాంబశివరావు, తోట రామకృష్ణ, పాలపాటి రవికుమార్, శనక్కాయల ఉమాశంకర్, అప్పిశెట్టి రంగా, ఈమని మాధవరెడ్డి, వనమా నరేంద్ర, యామిని శర్మ, వెలగలేటి గంగాధర్, తోట శ్రీనివాసరావు, ప్రదీప్ జైన్, బజరంగ్ రామకృష్ణ, రమణమూర్తి పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు మరియు హిందూ చైతన్య వేదిక కార్యకర్తలు ఉన్నారు.