‘హిందూ ద్వేషం, భారతదేశంపై విద్వేషం, దేశంలోని పెద్దశాతం ప్రజలైన హిందువులపై విద్వేషం అన్నవి భయంకరమైన మానసిక వ్యాధులు’.
ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ ఇలాంటి భయంకరమైన వ్యాధులు లేవు; ఉండవు! ఒక్క మనదేశంలోనే ఉన్నాయి; ఉంటాయి!!
హిందూ విద్వేషం లేదా వ్యతిరేకత, దేశ ద్వేషం, సమాజంపై విద్వేషం అన్నవి కరోనా కన్నా భయంకరమైనవి. కరోనాను తట్టుకుని నిలబడగలిగిన మనం ఈ భయంకరమైన రోగాల్ని అధిగమించి, నిర్మూలించి పురోగమించాలి.
దేశ ద్రోహం లేదా దేశ ద్వేషం లేదా సొంత మట్టిని దెబ్బకొట్టడం అన్నది భారత భూభాగంలో మొట్టమొదటగా బౌద్ధులతో మొదలైంది. అందుకే పుష్యమిత్ర శుంగుడు మట్టిని విదేశీయులకు అమ్మే భ్రష్ట బౌద్ధుల్ని హతమార్చాడు. బౌద్ధం తరువాత కమ్యూనిజమ్, నక్సలిజమ్,
కులోన్మాదం, ప్రాంతీయతా ఉన్మాదం, అంబేడ్కర్ వాదం (బతికుండగా అంబేడ్కర్ తిరస్కరించబడ్డారు!), చొరబడ్డ విదేశీ మతాలు కారణంగా హిందూ ద్వేషం హిందూ ప్రజలపై ద్వేషం మన దేశంలో వ్యాపించింది.
హిందువులపై మానసిక, భౌతిక, సాంస్కృతిక, మత, సాంఘీక దాడులు గత వెయ్యేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి.
ముస్లీమ్ ఆక్రమణలకు ముందు రాజ్యం చేసిన హున, కుషాన్, సక (సితిఅన్) రాజుల కాలంలో హైందవ ద్వేషం, విధ్వంసం లేవు. నిజానికి దేశ విరోధంగా ఉన్న బౌద్ధాన్ని పెద్ద ఎత్తున నిర్మూలించింది హున రాజులు (తొరమాన, మిహిర కుల).
ముస్లీమ్ దాడి, ఆక్రమణలతో సనాతన లేదా హిందూ విధ్వంసం పెద్ద ఎత్తున మొదలైంది.
ఇప్పటి చెన్నైలోని కపాలీశ్వరాలయం 1561లో చొరబడ్డ పోర్ట్చుగీస్ క్రైస్తవ మిషనరీల వల్ల ధ్వంసం చెయ్యబడింది. ఒకప్పుడు కపాలీశ్వర ఆలయం ఉన్న ప్రదేశంలో అప్పటి నుంచీ ఈనాటికీ ఒక చర్చ్ ఉంది! భారత భూభాగంలో హైందవంపై క్రిస్టిఅనిటి చేసిన తొలి దాడి ఇదే అయుండవచ్చు. తెలిసిన వారు ఇంతకు మించిన నిజాన్ని తెలియజెయ్యగలరు.
అటు తరువాత కమ్యూనిజమ్ హైందవంపై దాడి చేసింది.
గత వందేళ్ల కాలంగా విదేశీ మతం, కమ్యూనిజమ్, అంబేడ్కరిజమ్, బౌద్ధం, నక్సలిజమ్, సెక్యులరిజమ్, కులోన్మాదం, ప్రాంతీయతా ఉన్మాదం మూకుమ్మడిగా హైందవంపై దాడి చేస్తున్నాయి; హిందువుల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి.
హిందూ ద్వేషం, భారతదేశంపై విద్వేషం, దేశంలోని పెద్దశాతం ప్రజలైన హిందువులపై విద్వేషం వెదజల్లుతున్న వర్గాలు తమను తాము మేధావర్గాలు పరిగణించుకుని, ప్రకటించుకుని దేశం వీధుల్లోపడి హిందువుల్ని గాయపరుస్తున్నాయి.
ఈ మానసిక వ్యాధులతోనూ, మేధావి నామ మానసిక రోగులతోనూ మనం పోరాడాలి; ఆ పోరాటంలో మనం విజయం సాధించాలి.
భారతదేశం ఈ మానసిక రోగాలకు, రోగులకు బలైపోకూడదు.
– రోచిష్మాన్
9444012279