Suryaa.co.in

Telangana

ఎమ్మెల్యే రాజాసింగ్ కు హిందూ వాహిని మద్దతు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిందూ వాహిని కన్వీనర్ రాజవర్ధన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎంకు తలొగ్గి ఓ హిందు ఎమ్మెల్యే పై పిడి చట్టం ప్రయోగించడం హిందువులు జీర్ణించుకోలేక పోతున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ కు హిందూ వాహిని అండగా ఉంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు.

శనివారం రాజవర్ధన్, తెలంగాణ హిందూ వాహిని స్టేట్ కన్వీనర్ ఉప్పల్ రాజు జీలు మంగళహాట్ లోని రాజాసింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రాజాసింగ్ పై పెట్టిన పిడి యాక్ట్ ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఎం ఐ ఎం కనుసన్నులో నడుస్తుందన్నారు. చట్టం అందరికి సమానంగా ఉండాలని కానీ తెలంగాణలో అలా లేదని పేర్కొన్నారు.

ఎన్నో సార్లు హిందు దేవతలని దూషించిన అక్బరుద్దీన్ ఓవైసీ పై పిడి యాక్ట్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. బైంసాలో కూడా 30 మంది హిందు యువకులు పై అన్యాయంగా పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారని గుర్తు చేశారు. హిందువు పై కక్ష్య సాధింపు చర్య చేపట్టిన కేసీఆర్ కు త్వరలో హిందువులు తగిన బుద్ధి చెబుతారని వివరించారు. తెలంగాణ పోలీసులను కెసిఆర్ ఫోర్స్ గా కేసీఆర్ మార్చుకున్నారని తెలిపారు.

LEAVE A RESPONSE