Suryaa.co.in

Features

హిందుస్థాన్ కుంచించుకు పోతోంది

విశ్లేషకులు: ప్యూర్ నేషనలిస్ట్ చాడా శాస్త్రి

నా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అన్న మూర్ఖపు ఆలోచనే వేల మందిని శతాబ్దాలుగా బలికొంది. మా మతం ఒక్కటే గొప్పది, భూమి మీద మానవజాతి అంతా మా మతమే పాటించాలి అన్న మూర్ఖమైన, ప్రమాదకరమైన ఆలోచనే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది.

ఓ పాతిక సంవత్సరాలకు ముందు మనదేశంలో ఎక్కువగా “భారతీయ” ముస్లిమ్స్ ఉండేవారు. హిందువులు వారి దగ్గరకు పోయి తాయెత్తులు కట్టించుకునేవారు. ఇళ్ళకి , దుకాణాలకు సాంబ్రాణి ధూపాలు వేయించుకునే వారు. దూదేకుల సాయిబులు మన ఇళ్లకు వచ్చి పరుపులు కుట్టి ఇక్కడే భోజనాలు చేసి వెళ్లే వారు.. ముస్లిం టీచర్లు మనకు పాఠాలు చెపుతున్నప్పుడు రామాయణం, భారతంలోని కొటేషన్స్ చిన్న చిన్న కధలుగా చెప్పేవారు. అంటే వారి మతం వారు వ్యక్తిగతంగా ఆచరించుకుంటూ ఈ దేశ మెజార్టీ ప్రజల మత, సాంస్కృతిక విశ్వాసాలను గౌరవించేవారు.

కానీ రాను రానూ వహాబీజం వైపు యువత ఆకర్షితులవ్వడం, వేషధారణ మొదలగునవి మొత్తం మార్పు చెందాయి. అంతే కాక సెక్యూలర్ రాజకీయ పార్టీలు అలాంటి వారికి RSS,VHP వంటి హిందూ సంస్థలను బూచిగా చూపించి భయపెట్టి ప్రత్యేక ఓట్ బాంక్ గా తయారు చేసుకున్నారు.

పాతికేళ్ల పూర్వం ముస్లిం చిన్న పిల్లలను మామూలు దుస్తులలోనే ఉండే వారు , స్త్రీలు కూడా ఎవరో మరీ సంప్రదాయ బద్ధంగా జీవించేవారు తప్ప బురఖా స్త్రీలు తక్కువగా కనపడే వారు. మిగతా చాలా మంది సాధారణ వేషధారణే ఉండేది. ఇక్కడే కాదు ఇరాన్,ఇరాక్, ఆఫ్గన్ పాక్ మొ.. ఇస్లామిక్ దేశాల్లో కూడా స్త్రీలు ఆధునిక దుస్తులు ధరించేవారు. కానీ గల్ఫ్ అయిల్ డబ్బులతో వాహాబీ, సలాఫీ ప్రచారం ఊపందుకోవడంతో క్రమేపీ ఈ ఛాందస భావాలను, మత పద్దతులను ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజంపై బలవంతంగా రుద్దడం మొదలు అయింది. అంతే కాక కొందరు యువత ఈ మత మౌఢ్యం పూర్తిగా తలకు ఎక్కించుకుని ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన తమ అంతిమ లక్ష్యం అంటూ తీవ్రవాదం వైపు మొగ్గుచూపారు..

అప్పుడు ముస్లిం మత పెద్దలు వారిని అదుపు చెయ్యకుండా మౌనం వహించడం, మరికొందరు కమ్యునిష్ట్, కాపిటలిస్ట్ సిద్ధాంతాల ముసుగులో సమర్ధించడం మొదలుపెట్టారు. భారత్ లో అయితే RSS, VHP వంటి సంస్థలు వల్లే వీళ్ళు ఇలా తయారవుతున్నారు అని వెనకేసుకు రావడం కూడా మొదలు పెట్టారు.

వారితో పాటు హిందువులలో కూడా చదువుకున్న విజ్ఞులు, వామపక్ష భావం గల వారు తమకు తాము సెక్యూలరిష్టులుగా చెప్పుకుంటూ హిందూ సంస్ధల పేరుతో ఎవరో కొందరు ఎక్కడో ఒకటో రెండో మన దేశంలో చేసిన సంఘటనలను ఉదాహరణగా చూపించి మన దేశములోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఇస్లాం పేరుపై జరుగుతున్న మారణకాండను వెకిలి చేష్టలను సమర్ధిస్తూ వస్తున్నారు.

ముస్లిమ్స్ లో ఈ రకమైన మార్పు వల్ల మన ఒక్క భారత్ దేశం మాత్రమే ఇబ్బంది ఎదుర్కోవడం కాదు. అమెరికా, యురోప్ వంటి ప్రజాస్వామ్య దేశాలే కాక చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాలు కూడా ఈ మార్పు వల్ల ఇటువంటి సమస్యలని ఎదుర్కొంటున్నాయి.

నిజంగా మన విశాల భావాలు గల సెక్యూలరిస్టులు ఆరోపిస్తున్నట్లు హిందువులలో కూడా లోపం ఉంటే ఒక్క భారత్ లోనే కాదు అమెరికా యూరోప్ దేశాల్లో ఉన్న హిందువుల వల్ల కూడా అక్కడ స్థానిక సాంస్కృతిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాలి. కానీ మీరెప్పుడైన విదేశాలలో ఉన్న హిందువులు చేసిన ఇటువంటి విధ్వంస సంఘటనలు విన్నారా, ఎక్కడైనా హిందువులు బాంబులు వేసినట్లు గానీ తుపాకీలు పేలుస్తున్నట్లు గానీ వార్తలు వస్తున్నాయా అంటే రావు, ఎందుకంటే హిందువులు ఏదేశంలో ఉన్నా అంటే అమెరికా యూరోప్ వంటి ఫ్రీ సొసైటీ గల క్రిస్టియన్ దేశాలలో ఉన్నా లేక మత ఆంక్షలు గల ఇస్లామిక్ దేశాలలో ఉన్నా అక్కడ ఉన్న మెజార్టీ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వారితో కలిసి సహా జీవనం సాగిస్తారు. అంతే తప్ప అక్కడ ప్రభుత్వాల నుండి ప్రత్యేక హక్కులు కోరడం కానీ మేం ఇక్కడ మైనార్టీలం మమ్ము ప్రత్యేకంగా చూడండి అని కానీ అడగరు.

కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఇతర దేశాలలో హిందువులు సామరస్యంగా ఉన్నట్లు ఏ దేశంలోనూ ముస్లిమ్స్ ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నారు, ఇస్లామిక్ దేశాలు అయిన గల్ఫ్ దేశాలు కూడా వారి మతానికే చెందిన కష్టాల్లో ఉన్న రోహింగ్యాలను ఎందుకు ఆదుకోవడం లేదు, పై పెచ్చు ఈ మధ్య ఒక్క సారిగా 40,000 మంది పాకిస్తానీయులను తిరిగి ఆ దేశానికి తిప్పి ఎందుకు పంపించారు ఇస్లాం సోదర భావం పెంపొందిస్తుంది అని చెప్పి గత శతాబ్దంలో పలు దేశాలు కొత్తగా ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకుంటూ వస్తున్నారు.

మరి ఆ మధ్య సిరియా ముస్లిం శరణార్థులకు గానీ ఇప్పుడు ఆఫ్గన్ ముస్లిం శరణార్థులకు గానీ ఇప్పటికే వున్న ఇస్లామిక్ రాజ్యాలు ఆశ్రయం ఎందుకు కల్పించడం లేదు, ఇస్లామిక్ దేశాలు కానీ, కమ్యూనిస్ట్ దేశాలు కాని ఆ బాధ్యత తీసుకోకుండా మిగతా సెక్యులర్ దేశాలు మాత్రమే ఎందుకు ఆ బాధ్యత స్వీకరించాలి…

అన్ని దేశాల్లో హిందువులు బౌద్ధులు సిక్కులు కూడా ఉన్నారు కదా! ఆయా దేశాల్లో వాళ్ళు మైనార్టీలు కదా! వాళ్ళు ఇలాగే భారతీయ ముస్లిమ్స్ లాగా ప్రత్యేక హక్కులు కావాలి, ప్రత్యేక మత ఆధారిత చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎప్పుడైనా విన్నమా…

మరి ఇక్కడ భారతీయ ముస్లిమ్స్ ఇంత లిబరల్ గా ప్రశాంతంగా గడిపే హిందువుల తో భారత్ లోనూ, అంతకంటే ఎక్కువుగా అహింస బోధించే, పాటించే బౌద్ధులతో కూడా బర్మా శ్రీలంక లాటి దేశాలలో కూడా ఎందుకు ప్రశాంతంగా కలిసి జీవించలేకపోతున్నారు.

అహింసా వాదాన్ని బలంగా నమ్మే బౌద్ధులు కూడా ఇప్పుడు హింసాత్మకంగా మారడానికి ఎవరు కారణం
ఏ దేశాల్లో, ఏ ప్రదేశాల్లో మేం మెజార్టీ గా వుంటామో బలంగా వుంటామో అక్కడ మిగతా మతస్తులు మా చట్టాలకు అనుగుణంగా నే బతకాలి లేక పోతే మా మతంలోకి మారాలి అని మిగతా మతస్తులు మీద ఒత్తిడి నిజం కాదా,అందువల్లే కదా గతంలో కాస్త కొద్దో గొప్పో ఉండే హిందూ, సిక్కు , బౌద్ధ జనాభా ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ లో పూర్తిగా కనుమరుగైపోయారు. అదే పరిస్థితి కశ్మీర్ లో జరిగింది, పాక్ లో బంగ్లాదేశ్ లో కూడా జరుగుతోంది కదా, అక్కడ హిందువులు సిక్కులు మొదలైన ఇతర మతాల వారు భారత్ లో ముస్లిమ్స్ అనుభవిస్తున్నంత స్వేచ్ఛ అనుభవిస్తున్నారా

ప్రజాస్వామ్య, సెక్యూలర్ దేశం అని చెప్పుకుంటున్న భారత్ లో ఒకే ఒక్క రాష్ట్రం కాశ్మీర్ లో ముస్లిమ్స్ మెజార్టీ ఆ ఒక్క రాష్ట్రంలోనే హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మన కళ్ళతోటే చూసాం.
సాధారణ కాశ్మీరీ ముస్లిమ్స్ మంచివారు. ఇస్లామిక్ టెర్రరిస్టుల వల్లే హిందువులు ఆ రాష్ట్రం నుండి పారిపోయారు అనుకుంటే అక్కడ సాధారణ ముస్లిమ్స్ సాటి హిందువులను ఆదుకోవలసిన కనీస బాధ్యత లేదా అలా ఎందుకు చెయ్యలేదు. ఎందుకంటే ఇస్లామిక్ పాటించని దేశాలు, ప్రదేశాలు కొద్దీ కొద్దిగా ఇస్లామిక్ దేశాలుగా మార్చాలి అని అక్కడ సాధారణ ముస్లిమ్స్ లో కూడా లోలోపల ఉండే కోరిక ఒక కారణమా

పంజాబ్ లో ఇలాగే సిక్కు తీవ్ర వాదులు హిందువులను ఇబ్బంది పెడితే సిక్కు సోదరులు అలాగే చూస్తూ ఊరుకున్నారా అదే అదనుగా భావించి హిందువులను పంజాబ్ నుండి శాశ్వతంగా తరిమేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారా, లేదే, అలాగే 2002 గుజరాత్ గొడవలు అప్పుడు అక్కడ నుండి హిందువులు ముస్లిమ్స్ కుటుంబాలను శాశ్వతంగా తరిమేసారా లేదు కదా! ఇప్పుడు పంజాబ్ లో హిందువులు, అలాగే గుజరాత్ లో ముస్లిమ్స్ అక్కడ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నారు కదా, మరి పంజాబ్ లో సిక్కులు, గుజరాత్ లో హిందువులూ చేసిన ఇదే పని కాశ్మీరీ ముస్లిమ్స్ ఎందుకు చేయలేక పోయారు, సాటి మనుషులైన హిందువుల మీద వాళ్ళు సానుభూతితో ఎందుకు అండగా ఉండలేకపోయారు, గుజరాత్ లో మతకలహాలపై చాలా గొడవ చేశారు. కాశ్మీర్ నుండి హిందువులు బయటకు పోయినట్లు ఎన్ని వేల ముస్లిం కుటుంబాలు గుజరాత్ నుండి బయటకు వలస వెళ్లిపోయారు,

గత వంద సంవత్సరాల చరిత్ర చూస్తే ఎక్కువుగా ఇబ్బంది పడుతున్నది, పడ్డది హిందువులే కదా!
మిగతా మతాల జోలికి పోకుండా ప్రశాంతంగా ఒకప్పుడు జీవనం గడిపిన హిందువులు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాక్, బాంగ్లాదేశ్, కాశ్మీర్ లో రమారమి కనుమరుగు అయిపోయారు/అవుతున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్ లో కొన్ని బోర్డర్ జిల్లాల్లో, కేరళలోని మల్లపురం జిల్లాలో హిందువుల పరిస్ధితి బాగోలేదు. అంటే హిందువులు వాళ్ళ తప్పు లేకుండానే వాళ్ళు ప్రశాంతంగా నివసించగలిగే భౌగోళిక ప్రదేశం గత వంద సంవత్సరాలలో క్రమేపీ కుంచించుకు పోతోంది.

మరి మన దేశం చుట్టుపక్కల ముస్లిమ్స్ జనాభా తగ్గుతున్న దేశాలూ/ ప్రదేశాలు ఉన్నాయా, కనీసం హిందువులు మెజార్టీగా ఉన్న భారత్ లో ముస్లింలు నివసించే ప్రదేశాలు తగ్గడం కానీ జనాభా తగ్గడం గానీ జరిగిందా, లేదే..

మరి హిందువులు నివసించే ప్రదేశాలు క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంటే హిందువులు, హిందూ సంస్థలు భయపడడంలో తప్పులేదు కదా! మరి అదే మాట వారు పైకి అంటే మతతత్వ వాదులు అని ముద్ర వెయ్యడం ఏమిటి,ఇప్పుడు ముస్లిమ్స్ తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న హిందూ సెక్యూలర్స్ రేపు కాశ్మీర్ లా దేశం అంత మారితే దేశంలో మీరు నిర్వచించే సెక్యూలరిజం బతికి బట్టకడుతుంది అని హామీ ఇవ్వగలరా, ఇది ఎదో ఊహాజనిత ప్రశ్న కాదు. పైన చెప్పిన సంఘటనలు ఎప్పుడో శతాబ్దాల కిందట జరిగినవి కాదు. గత 100 సంవత్సరాలలోపే జరిగాయి. ఆఫ్ఘన్, పాక్, బంగ్లా కశ్మీర్ ,వెస్ట్ బెంగాల్ , కేరళ ఎలా మారిపోయాయో/ మారుతున్నాయో కళ్లెదుగానే చూసాం/చూస్తున్నాం కదా!

ఇక్కడ RSS వల్ల హిందూ సంస్థల వల్ల వారికి ఇబ్బంది. సరే మరి RSS, హిందూ సంస్థలు లేని మిగతా దేశాల్లో అక్కడ ఉన్న మెజార్టీ ప్రజలతో ముస్లింలు ఎందుకు ఘర్షణలు పెట్టుకుని అశాంతికి
కారణం అవుతున్నారు భారత్ లో హిందూ సంస్థల వల్ల, శ్రీలంక, బర్మాలో బుద్ధులు వల్ల, అమెరికాలో యూరోప్ లో క్రిస్టియన్స్ వల్ల, ఇజ్రెయేల్ లో jews వల్ల ఇలా ప్రతీ చోటా అక్కడ ఉన్న వారితో వీరికి పడటం లేదు. సరే ఒక ముస్లిమ్స్ వాళ్లదే కరెక్ట్ మిగతా వాళ్ళందరిది తప్పు అనుకుందాం.పోనీ 90% ముస్లిమ్స్ ఉన్న పాక్ , ఆఫ్ఘన్, ఇరాన్ ఇరాక్ , జోర్డాన్, సిరియాలో , టర్కీలలో శాంతిగా ఉన్నారా లేరు కదా, దీనికి కారణం ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించారా.

1947 లో మేం హిందువులతో కలిసి ఉండలేం మాకు ప్రత్యేక దేశం కావాలి అని పాక్ తీసుకొన్నారు. అక్కడ ప్రశాంతంగా వుంటున్నారా, లేదు అక్కడ కూడా షియా , సున్నిలు గొడవలు అది కాకపోతే ఇంకో కొట్లాటలు.ముస్లింలు నాన్ ఇస్లామిక్ దేశాల్లో ప్రశాంతంగా ఉండలేకపోవడానికి కారణం ఏ దేశంలో ఉంటున్నామో ఆదేశ సంస్కృతి లో కలవలేకపోవడం. ప్రతీ విషయములోనూ ప్రత్యేకంగా మత పద్దతి ఒకటి ఏర్పచుకొని అలాగే కచ్చితంగా బతకాలి అని నిర్ణయించుకోవడం వల్ల.

భారత్ లో RSS ని VHP ని బ్యాన్ చేస్తే వీరు ప్రశాంతంగా ఉండగలరా, అదే నిజం అయితే RSS/VHP లేని దేశాల్లో వీరు హాయిగా ప్రశాంతంగా వుండగలగాలి కదా! మరి అక్కడ ఎందుకు ఉండలేకపోతున్నారు. మిగతా వాళ్ళని తిడితే మార్పు రాదు. లేదా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మా మీద ప్రపంచం అంతా ద్వేషం పెంచుతున్నారు అని ప్రతీసారీ విక్టిమ్ కార్డు వాడితే ప్రయోజనం ఏమి ఉండదు,

ముస్లిం శరణార్ధులను యూరోపియన్ దేశాల్లోనికి రానివ్వకండి అని ఆయా దేశాల్లో ఉంటున్న జాతీయవాదులు అప్పట్లో గోడవచేశారు. అయినా మొదటి నుండి నిఖార్సయిన ఉదారభావాలు గల యూరోపియన్ దేశాలు శరణార్ధుల కష్టాలను గుర్తించి ఆశ్రయం కల్పించి అక్కున చేర్చుకున్నారు. ఇలా చేయడంలో ముందున్న దేశాల్లో ఫ్రాన్స్, జర్మనీ గురించి చెప్పుకోవాలి. జర్మన్ ఛాన్సలర్ మోర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మార్కొన్ వంటి వారు ఈ శరణార్ధుల వైపు నిలిచి మాట్లాడారు. ప్రపంచంలో గల వామపక్ష మేధావులు, ఉదార వాదులు, ముస్లిం సమాజం ఈ ఇద్దరి నాయకులను గొప్ప లిబరల్ నాయకులుగా ఆకాశానికి ఎత్తేశారు.

ఆ మధ్య ఫ్రాన్స్ లో జరిగిన టీచర్ హత్య సంఘటనపై ఆ ప్రభుత్వ స్పందనపై ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమ్స్ స్పందన చూస్తున్నాం. ఆఖరుకు అంత లిబరల్ నాయకులు అయిన ఫ్రాన్స్ మార్కొన్ మరియు జర్మనీ మార్కెల్ కూడా ఇప్పుడు ముస్లిం తీవ్రవాదం పై గళమెత్తారు. అటువంటి లిబరల్ నాయకులు కూడా ఇలా మారిపోవడానికి ఏమిటీ కారణం, హిందువులలో కొందరు ఎవరైనా విపరీతంగా లేక ఉన్మాదంగా ప్రవర్తించినా లేక హింసాత్మక ఘటన చేసినా ఈ హిందూ మితవాదులు, ఉదార భావాలు గల హిందువులలో ఉన్న వారు పెద్దగా గోడవచేసి వారికి శిక్ష పడాలి అని కోరుకుంటారు.. హిందూ సమాజంలో సహజంగా గల హింసా వ్యతిరేకత వల్ల ఎవరు హింసను చేసినా ఎక్కువ మంది హిందువులు గట్టిగా ఖండిస్తారు. ఈ వ్యతిరేక స్పందనల మళ్లీ ఎవరైనా హిందూ యువకులు అలా ఉన్మాదంగా ప్రవర్తించడానికి భయపడతారు.

ఈ చెక్స్ అండ్ బేలన్సస్ వల్లే హిందూత్వం ఎప్పటికి తీవ్రవాదం వైపు మొగ్గుచూపదు. ఈ ఛెక్స్ అండ్ బేలన్సస్ ముస్లిం సమాజంలో లోపించాయి.. అందుకే ఈ అనర్ధాలు. అందుకే గతంలో ఉన్న అవసరం కంటే ఇప్పుడు ముస్లింలలో ఉన్న మితవాదులు ఇంకా గట్టిగా నోరు తెరవవలసిన సమయం వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఆఫ్గన్ లో ఏర్పడిన పరిస్థితే నేడు కాకపోతే రేపు ప్రతీ దేశంలో ఏర్పడే అవకాశం వుంది. దాని వల్ల ఒక్క ముస్లిం సమాజమే కాదు ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది.

LEAVE A RESPONSE