Suryaa.co.in

హిందుత్వ సిన్మాలొస్తున్నాయ్.. శుభం!
Entertainment

హిందుత్వ సిన్మాలొస్తున్నాయ్.. శుభం!

తెలుగు డైరెక్టర్లు మంచి హిందుత్వ బేస్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.. అద్భుతమైన డైరెక్షన్ అఖండ.. కంగ్రాట్స్ బోయ పాటి శ్రీనివాస్ జీ.. సినిమా కోసం కష్ట పడిన యూనిట్ని దృష్టిలో ఉంచుకుని పైరసీ చూడకండి.. విమర్శలు చేయాలి అనుకుంటే లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాల మీద చేయండి.. అఖండ మీద విమర్శలు వద్దు.
అఖండ సినిమా చాలా బాగా తీశారు , బాలకృష్ణ గారి నటన , బోయపాటి_శ్రీను గారి దర్శకత్వం అద్భుతం
శివతత్వాన్ని బాగా చూపించారు… అహింసా పరమో ధర్మః , ధర్మ హింస తదైవచ…అర్ధాన్ని చక్కగా వివరించారు ఈ చిత్రంలో హిందూ ధర్మానికి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు , తెగ నరకమనే ధర్మం చెబుతుంది , అంతేకాని… మధ్యలో ఎవడో వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని , దిక్కుమాలిన శాంతి పదాలు హిందువులకు అలవాటు చేసి… ధర్మం నాశనం అయ్యేలా చేసాయి… విదేశీ విత్తన ముఠాలు…హిందూబందువులందరూ ఈ చిత్రం తప్పక చూడండి .
అఖండ నిజంగా అద్భుతమైన సినిమా…
అందులో కొన్ని బెంచ్ మార్క్ డైలాగ్స్ ఉన్నాయి…
అవి తెరపై మాత్రమే చూడాలి…
ఆ పూనకం ప్రతీ హిందువు పొందాలి…
మళ్లీ చూడండి… మళ్లీ మళ్లీ చూడండి…
ఫైనల్ గా ధర్మ రక్షణకు అందరూ అఖండ పాత్రపోషించండి శిఖండిపాత్ర కాదు.
సినిమా అంటే అనేక పరిమితులు ఉంటాయి…
వాటిలో చాలా వరకు అధిగమించి, ధర్మం గురించి మాట్లాడిన ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసి ఆనందించండి…
మనకు వ్యతిరేకంగా ఉంటే వెయ్యి మందికి చెప్పే మనం… మనకు అనుకూలంగా ఉన్న దాని గురించి ఒక పది మందికి చెప్పడం తప్పేం కాదు.
ఇది ఫ్యాన్స్ గర్వించే సినిమా మాత్రమే కాదు…
యావత్ హిందు సమాజం గర్వించే సినిమా..
చివరగా…
జై హిందూ ధర్మం
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
జై_నిర్మాత (మిరియాల రవీందర్ రెడ్డి )
(మీ దమ్ము, మీ నిజాయితీ ఇలాంటి కాన్సెప్ట్ పైన ఇంత డబ్బు పెట్టినప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అయ్యింది)

– శర్మ సీహెచ్‌వీఎస్

LEAVE A RESPONSE