Suryaa.co.in

National

సీజేఐ ఎన్వీ రమణకు మరో హోదా

సీజేఐ కు గౌరవ డాక్టరేట్

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మరో హోదా దక్కనుంది. సీజేఐ గా అవకాశం దక్కించకున్న ఎన్వీ రమణ..ఇప్పుడు కొత్త పురస్కారం అందుకోబోతున్నారు. ఈ నెల 26న సీజేఐ హోదా నుంచి ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆయన వారసుడి పేరు ఖరారు అయింది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీజేఐ ఎన్వీ రమణకు తెలుగు గడ్డ పైనే మరో పురస్కార ప్రధానం చేసేందుకు రంగం సిద్దమైంది. దీంతో ఇప్పటి వరకు జస్టిస్ ఎన్వీ రమణగా ఉన్న ఆయన పేరు ముందు డాక్టర్ హోదా చేరనుంది.

ఇక నుంచి ఆయన డాక్టర్ ఎన్వీ రమణ కాబోతున్నారు. ఇందులోనూ పలు ప్రత్యేకతలు ఉన్నాయి. 105 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ రోజున యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం జరగనుంది. యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.గవర్నర్ తమిళసై యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఈ పురస్కారం ప్రధానం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇదే తొలి డాక్టరేట్ కావటంతో ఈ సారి ప్రత్యేకత. అది సీజేఐ అందుకోబోతున్నారు.

LEAVE A RESPONSE